పాటియాలా సల్వార్ (పట్టియన్ వాలీ సల్వార్ గా పిలువబడుతుంది) (సల్వార్ గా ఉర్దూలో పలుకుతారు) భారతదేశంలోని పంజాభ్ రాష్టృ ఉత్తర ప్రాంతంలోని పాటియాలా నగరంలో మహిళలు ధరించే వస్త్రం. ఈ వస్త్ర మూలాలు పాటియాలాలో ఉన్నాయి. ప్రాచీనంగా పాటియాలా రాజు రాజ దుస్తులుగా పాటియాలా సల్వార్ ను ఉపయోగిండాడు. పాటియాలా సల్వార్ కు పటానీ దుస్తులతో పోలిక ఉంటుంది. దానివలెనే వదులుగా ఉండే దిగువ దుస్తులు సల్వార్ గానూ, మోకాళ్ళవరకు ఉన్న పొడవైన పై వస్త్రము "కమీజ్" గాను పిలువబడుతుంది. దశాబ్ద కాలంపాటు ఈ దుస్తులు పురుషులచే ధరించబడటంలేదు. దీనిలో కొన్ని మార్పులతో పాటియాలా సల్వార్ గా రూపాంతరం చెందింది.
పంజాబ్, యితర ఉత్తర భారతదేశ ప్రాంతాలలో ఈ దుస్తులు అధికంగా యిష్టపడటానికి కారణం వేసవికాలంలో అనుకూలంగా ఉండటం, మన్నికను కలిగి ఉండటం
ఈ పాటియాలా సల్వార్ వదులుగా ఉన్నందున, మడతలతో కుట్టినందుల అవి ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ దుస్తులను కుట్టడానికి సాధారణంగా కావలసిన వస్త్రం కంటే రెండు రెట్ల వస్త్రం అనగా నాలుగు మీటర్ల పొడవు వస్త్రం అవసరమవుతుంది. మడతలుతో కూడిన పాటియాలా సల్వార్ చాలా అందంగా ఉంటుంది. ఈ మడతలు బెల్ట్ పై కుట్టబడతాయి.
పంజాబ్ లోని పాటియాలా నగరంలోని షాహి (రాజరిక) ప్రజలు ధరించిన నాటి నుండి ఈ మడతలను పాటియాలా "షాహి"గా పిలుస్తారు. సాంప్రదాయక పంజాబ్ సల్వార్ సూట్ కూ ప్రత్యామ్నాయంగా ఈ దుస్తులను ధరిస్తారు.
పాటియాలా సల్వార్ వివిధ షర్టులు (కమీజ్), చిన్న షర్టులు, పెద్ద షర్టులతో పాటు ధరిస్తారు. ప్రస్తుతం కొంతమంది బాలికలు మిశ్రమ ఆసియన్, పశ్చిమాది రాష్టాల వారి వలె కనబడటానికి టిషర్టులు కూడా ధరిస్తారు. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయకమైన పై దుస్తులుగా షార్ట్ కమీజ్ ను వాడుతారు.
"బంటీ ఔర్ బాబ్లీ" (2005) చిత్రంలో రాణి ముఖర్జీ పాటియాలా సల్వార్, కుర్తీలతో కనిపిస్తారు. వీటిని ఆకీ నారులా రూపొందించాడు.[1]
కరీనా కపూర్ అనే సినిమా నతి "జబ్ వే మెట్" చిత్రంలో పాటియాలా సల్వార్, టీషర్టులతో కొత్తదనంతో కనిపించారు. ఇతర సెలబ్రిటీలైన "సోనాక్షి సిన్హా, అమృతారావు, సోనం కపూర్, ప్రీజీ జింతా మొదలైన వారు కూడా ఈ దుస్తులు ధరించారు.