![]() | |||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పాల్వంకర్ బాలూ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ధర్వాడ్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1876 మార్చి 19||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 4 జూలై 1955 బొంబాయి, బొంబాయి రాష్ట్రం, భారతదేశం | (aged 79)||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేతి ఆర్థడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||
బంధువులు | పాల్వంకర్ శివరాం (సోదరుడు) , పాల్వంకర్ గణపత్ (సోదరుడు) , పాల్వంకర్ విఠల్ (సోదరుడు) | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1905–1921 | హిందూ క్రికెట్ టీం | ||||||||||||||||||||||||||
తొలి ఫస్టు క్లాస్ క్రికెట్ | 8 ఫిబ్రవరి 1906 హిందూ - యూరోపియన్ క్రికెట్ టీం | ||||||||||||||||||||||||||
చివరి ఫస్టు క్లాస్ క్రికెట్ | 8 డిసెంబరు 1920 హిందూ - పార్శీస్ క్రికెట్ టీం | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2009 జనవరి 27 |
బాబాజి పాల్వంకర్ బాలూ, (ధార్వాడ్, 19 మార్చి 1876– 4 జూలై 1955, బొంబాయి), పాల్వంకర్ బాలూగా సుపరిచితుడైన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఎడమ చేతివాటం స్పిన్ బౌలర్. బాలూ బంతిని రెండు వైపులా తిప్పగలడు. ఇతను కొద్దిపాటి నేర్పుగల ఆఖరి వరుస బ్యాట్స్‌మన్. బాలూ 1905/06 నుండి 1920/1921 వరకూ మొత్తం 33 ఫస్టుక్లాస్ మ్యాచులు ఆడి 15.21 సగటుతో 179 వికెట్లను సాధించాడు.
పాల్వంకర్ బాలూ బొంబాయి ప్రెసిడెన్సీ లోని ధర్వాడ్ లో చంభర్ కులంలో జన్మించాడు. అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో 112వ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ కు చెందిన సిపాయి. బాలూ పూణేలో ఉన్న అధికారులు వదిలిపెట్టిన పరికరాలతో క్రికెట్ ఆడాడు. [1]
బాలూకు ముగ్గురు సోదరులు ఉన్నారు. వారు పాల్వంకర్ శివ్రామ్, విఠల్ పాల్వాంకర్, పాల్వాంకర్ గణపత్ లు. తరువాత వారు క్రికెట్ ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు.
అతను పూణేలోని పార్శీల కోసం పిచ్‌ను నిర్వహించే గ్రౌండ్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు బ్రిటిష్ పూనా జిమ్‌ఖానాకు చెందిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ జె.జి.గ్రిగ్‌కు బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతను స్పిన్ బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు.
1896 లో అతను బొంబాయికి వెళ్లి పర్మానందస్ జివాండాస్ హిందూ జింఖానాలో ఎంపికయ్యాడు. బొంబాయి క్వాడ్రాంగులర్ టోర్నమెంట్లలో రెండింటినీ ఆడాడు[2].
అతను బాంబే బెరార్, సెంట్రల్ ఇండియన్ రైల్వేలలో ఉద్యోగం పొందాడు. రైల్వే కార్పొరేట్ క్రికెట్ జట్టు కోసం కూడా ఆడాడు.
అతను 1911 లో ఇంగ్లాండ్ పర్యటన కోసం 'మహారాజా ఆఫ్ పాటియాలా' అఖిల భారత జట్టులో ఆడాడు. ఈ పర్యటన విఫలమైంది. కానీ బాలూ అత్యుత్తమ ప్రదర్శన ప్రశంసించబడింది.[3]
"బాలూ కోసం క్రికెట్ కెరీర్‌లో సమానత్వం లేకుండా కుల వివక్షను ఎదుర్కొన్నాడు.. అతను మ్యాచ్‌లలో టీ విరామ సమయంలో అతనికి పెవిలియన్ వెలుపల పునర్వినియోగపడని ప్లేట్‌లో వడ్డించేవారు. అతను చేతులు, ముఖం కడుక్కోవాలని కోరుకుంటే తోటి దళిత పరిచారకుడు అతనికి ఒక మూలలో నీళ్ళు తెచ్చేవాడు, ఒక ప్రత్యేక టేబుల్ వద్ద ఒక ప్రత్యేక ప్లేట్ లో భోజనం తీసుకునేవాడు"[4]
అతను భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[5]
అతను 1955 లో మరణించాడు. అతని అంత్యక్రియలకు అనేక మంది జాతీయ నాయకులతో పాటు క్రికెటర్లు కూడా హాజరయ్యారు.[8]