పి. చంద్రారెడ్డి P. Chandra Reddy | |||
పదవీ కాలం 1958 – 1964 | |||
ముందు | కోకా సుబ్బారావు | ||
---|---|---|---|
తరువాత | పి. సత్యనారాయణ రాజు | ||
పదవీ కాలం 1964 – 1966 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 1976 అక్టోబరు 7 |
జస్టిస్ పి. చంద్రారెడ్డి లేదా పలగాని చంద్రారెడ్డి (జూలై 1, 1904 - అక్టోబర్ 7, 1976) హైకోర్టు న్యాయమూర్తి. నెల్లూరులోని వి.ఆర్. ఉన్నత పాఠశాలలో చదివి తర్వాత మద్రాసులోని పచ్చియప్ప కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించారు.
1928 ఆగస్టు 13 తేదీన మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. సివిల్, క్రిమినల్ కేసులు రెంటినీ వాదించేవాడు. 1949 జూలై 16 అదే కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. తరువాత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడి, తదనంతరం ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.
చంద్రారెడ్డి ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆపద్ధర్మ గవర్నరుగా కొద్దికాలం పనిచేశాడు. 1964 డిసెంబరు 23 తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1966 జనవరి 7 తేదీన పదవీ విరమణ చేశారు.
చంద్రారెడ్డి అక్టోబర్ 7 1976 తేదీన పరమపదించాడు.[1][2][3]