ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
పి. వి. గంగాధరన్ | |
---|---|
జననం | పరాయరుకండి వెట్టత్ గంగాధరన్ 1943 కాలికట్, భారతదేశం |
మరణం | 2023 అక్టోబరు 13, (వయస్సు 80) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1977 – 2006 |
పరాయరుకండి వెట్టత్ గంగాధరన్ (1943 - 2023 అక్టోబరు 13) కేరళకు చెందిన భారతీయ చలనచిత్ర నిర్మాత, వ్యాపారవేత్త. ఆయన తన నిర్మాణ సంస్థ గృహలక్ష్మి ప్రొడక్షన్స్ క్రింద 22 మలయాళ చిత్రాలను నిర్మించాడు. నిర్మాతగా, ఆయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ లతో పాటు పలు ఇతర అవార్డులను గెలుచుకున్నాడు.[1]
ఆయన 1943లో కాలికట్‌లో మాధవి సామి (1916–1996), ప్రముఖ వ్యాపారవేత్త, కేటీసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు పి. వి. సామి (1912-1990) దంపతులకు జన్మించాడు. ఆయన మాతృభూమి వార్తాపత్రిక మేనేజింగ్ ఎడిటర్ పి. వి. చంద్రన్ తమ్ముడు. స్వయంగా పారిశ్రామికవేత్త.అయిన పి.వి.గంగాధరన్ మాతృభూమికి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించాడు.
మాజీ అడ్వకేట్ జనరల్ రత్న సింగ్ కుమార్తె పి.వి. షెరియన్ ను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి షెనుగా జయతిలక్, షెగ్నా విజిల్, షెర్గా సందీప్ అతని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.