పుంజల శివశంకర్ | |||
![]()
| |||
మాజీ ఎం.పి.
| |||
నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మామిడిపల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | 1929 ఆగస్టు 10||
మరణం | 2017 ఫిబ్రవరి 27 హైదరాబాద్, తెలంగాణ | (వయసు: 87)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి పుంజాల | ||
సంతానం | పి. సుధీర్ కుమార్, పుంజాల వినయ్, జలజా | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ |
పుంజల శివశంకర్ (ఆగష్టు 10, 1929 - ఫిబ్రవరి 27, 2017) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో భారత జాతీయ కాంగ్రెస్ ఎం.పి.గా పనిచేశాడు.
శివశంకర్ 1929, ఆగష్టు 10 న రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో జన్మించాడు.
అమృత్‌సర్ నుంచి బి.ఏ. పట్టాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొందాడు. 1974-75 మధ్యకాలంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు.
పి.శివశంకర్ వివాహం 1950లో లక్ష్మీబాయితో జరిగింది.[1] ఇతని కుమారుడు పి.వినయ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులగా పనిచేస్తుండగా, కోడలు అలేఖ్య పుంజాల కూచిపూడి కళాకారిణిగా, నాట్య గరువుగా ఉన్నారు.ఆయన చిన్న కుమారుడు దివంగత పి.సుధీర్ కుమార్ మలక్ పెట్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు.[2]
1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు.[3] 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశాడు. 1998లో తెనాలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి 2008లో చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ పార్టీలో చేరి, కొంతకాలం పనిచేశాడు.[4][5] శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యులు పి. వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ ఇన్ ఛార్జ్ గా ఉన్నాడు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ 2017, ఫిబ్రవరి 27 ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52లోని తన స్వగృహంలో తుడి శ్వాస విడిచాడు.[6]