పులియూర్ సుబ్రమణియం నారాయణస్వామి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | అనతాండవపురం, మయిలదుత్తురై, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా | 1934 ఫిబ్రవరి 24
మరణం | 2020 అక్టోబరు 16 | (వయసు 86)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాయకుడు |
వెబ్‌సైటు | https://www.psnarayanaswamy.org/ |
పులియూర్ సుబ్రమణియం నారాయణస్వామి ( 1934 ఫిబ్రవరి 24 – 2020 అక్టోబరు 16) ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.
ఇతడు తమిళనాడు లోని అనతాండవపురం గ్రామంలో పి.ఎన్.సుబ్రమణియన్, మధురాంబాళ్ దంపతులకు 1934, ఫిబ్రవరి 24న జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా వైద్యుడైనప్పటికీ సంగీతం పట్ల అభిరుచి మెండుగా ఉండేది.
ఇతడు వసంత నారాయణస్వామిని వివాహాం చేసుకున్నాడు. ఈ దంపతులకు లక్ష్మి, మైథిలి, ఉమ అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఇతని మనుమరాలు మనస్విని గాయనిగా పేరు గడించింది.
ఇతడు ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, తిరుప్పంబరం సోమసుందరం పిళ్ళై, టి.ఎం.త్యాగరాజన్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ల వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు కుంభకోణం రాజమణి శాస్త్రి వద్ద వీణావాదన నేర్చుకున్నాడు. ఇతడు సంగీతగురువుగా ప్రశంసలను పొందాడు.[1]
ఇతడు తన 12వ యేట "బాల గాన కళారత్నం" బిరుదును పొందాడు. ఇతడు ఆకాశవాణిలో పనిచేశాడు.[2] 1999లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి "సంగీత కళాచార్య" బిరుదును ఇచ్చింది.[3] 2003లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.[1][4][5][6] కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005లో కర్ణాటక సంగీతం - గాత్రం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రదానం చేసింది.
ఇతడు తన 87వ యేట 2020, అక్టోబరు 16న చెన్నై, మైలాపూర్‌లోని తన స్వగృహంలో మరణించాడు.[7]