పి.జి విందా

పి.జి.వింద
పి.జి. విందా
జననం (1976-05-10) 1976 మే 10 (వయసు 48)
వృత్తిఛాయాగ్రాహకుడు, దర్శకుడు & నిర్మాత
బిరుదుభారతీయ ఛాయాగ్రాహకుడు

పి.జి.వింద తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. 2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇతను అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు మొదలగు సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసాడు. ఇతను ఛాయగ్రాహకుడిగా పనిచేసిన గ్రహణం సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.

స్వస్థలం

[మార్చు]

పి.జి. వింద స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా లోని బిజినపల్లి మండలం.

విద్యాభ్యాసం

[మార్చు]

ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. ఎనిమిది నుండి పదవ తరగతి వరకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని బీచుపల్లిలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో చదివాడు. జీవశాస్త్రాలు ప్రధాన విషయాలుగా ఇంటర్మీడియట్ బిజినపల్లి మండలంలోని పాలెంలో చేశాడు. వైద్య విద్య అభ్యసించడానికి ప్రవేశ పరీక్ష రాశాడు. కానీ, సీటు రాకపోవడం చేత కర్నూలు లోని సిల్వర్ జూబ్లి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సినిమాటోగ్రఫీ పూర్తి చేశాడు[2].

చిత్రరంగంలో తొలి అడుగులు

[మార్చు]

జె.ఎన్.‌టి.యూ.లో సినిమాటోగ్రఫీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే ఛాయాగ్రాహకుడు మధు అంబటి వద్ద అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్‌గా అవకాశం వచ్చింది. అతనితో లజ్జ హిందీ సినిమాకు పనిచేశాడు. తన మిత్రుడు అల్తాఫ్ ద్వారా ఇంద్రగంటి మోహన కృష్ణ పరిచయం కావడం వలన తొలిసారి ఛాయాగ్రాహకుడిగా గ్రహణం సినిమాకు పని చేసే అవకాశం వచ్చింది.

దర్శకుడిగా

[మార్చు]

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి ప్రధాన పాత్రలో లోటస్ పాండ్ చిత్రాన్ని రూపొందించాడు.

ఛాయాగ్రహణం

[మార్చు]
Year Movie Notes
2004 గ్రహణం 2005 జాతీయ సినిమా పురస్కారాలలో దర్శకుడి ఉత్తమ తొలి సినిమా అవార్డు
2005 నందనవనం 120 కి.మీ.
2006 అనుమానాస్పదం
2008 అష్టా చమ్మా
2008 వినాయకుడు (సినిమా)
2009 స్నేహగీతం
2010 అది నువ్వే
2010 కీ (సినిమా)
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ
2010 ది లోటస్ పాండ్ 14th International Children's Film Festival India (ICFFI)
2013 D/O వర్మ
2013 అంతకు ముందు... ఆ తరువాత...
2013 ఆ అయిదుగురు
2014 రోమియో
2014 నిన్నదల కన్నడ చలన చిత్రం
2014 నాలా దమయంతి
2014 బందిపోటు
2015 జ్యోతి లక్ష్మి
2015 లోఫర్
2016 జెంటిల్ మేన్
2017 లక్కున్నోడు
2017 అమీ తుమీ
2018 సమ్మోహనం
2019 మథనం
2020 వి
2022 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
2023 మామా మశ్చీంద్ర
2024 పురుషోత్తముడు
2024 సారంగపాణి జాతకం

మూలాలు

[మార్చు]
  1. http://www.idlebrain.com/celeb/interview/pgvinda.html
  2. పోట్టేల దెబ్బకు కెవ్వుకేక, హ్యాపీడేస్,(నిర్వహణ:గొరుసు జగదీశ్వర్‌రెడ్డి),ఆదివారం ఆంధ్రజ్యోతి, తేది:01-07-2012,పుట-6