పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక

పిఎస్‌ఎల్‌వి-సీ34
PSLV-C34
Model of the PSLV rocket
మిషన్ రకంDeployment of 20 satellites.
ఆపరేటర్ఇస్రో
వెబ్ సైట్ISRO website
మిషన్ వ్యవధి26 నిమిషాలు
ప్రయాణించిన దూరం505 కిలోమీటర్లు
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకపిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక
అంతరిక్ష నౌక రకంLaunch vehicle
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి710,000 పౌన్లు (320,000 కి.గ్రా.)
పే లోడ్ ద్రవ్యరాశి2,840 పౌన్లు (1,288 కి.గ్రా.)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ09:26:00, జూన్ 22, 2016 (2016-06-22T09:26:00) (IST)
రాకెట్పి.ఎస్.ఎల్.వి.
లాంచ్ సైట్సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
మోహరించిన తేదీ22 జూన్ 2016
మిషన్ ముగింపు
పారవేయడంPlaced in graveyard orbit
డియాక్టివేట్ చేయబడింది22 Jun 2016
కక్ష్య పారామితులు
రెజిమ్Sun-synchronous orbit
పేలోడ్
One Cartosat-2 satellite,
One SATHYABAMASAT
One SWAYAM &
17 other satellites from USA, కెనడా, జర్మనీ & ఇండొనేషియా.
 

పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక అనునది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో రూపొందించిన ఉపగ్రహ వాహక/ప్రయోగ నౌక.ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా జూన్, 22 2016న మూడు స్వదేశీ, 17 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించుటకు ఇస్రో సంస్థ సిద్ధమైనది. పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (క్లుప్తంగా షార్) వేదిక.ఇస్రో సంస్థ ఏర్పడినప్పటినుండి 2016 వరకు శ్రీహరికొట నుండి ఇస్రో మొత్తంమీద 89 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినది. ఈ క్రమంలో ఇస్రో 53 రాకెట్ ప్రయోగాలను, ఒక అంతరిక్ష క్యాప్స్యూల్ రికవరీ ప్రయోగం, జీఎస్‌ఎల్‌వి మార్క్‌-3ప్రయోగాత్మక ప్రయోగం, మరో అంతరిక్ష స్పెస్ షెటిల్ ప్రయోగాలు చేసారు. 53 ప్రయోగాలకుగాను 46 ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. 46 విజయవంతమైన ప్రయోగాల్లో 34 విజయాలు పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహక నౌక ద్వారా కావటం జరిగింది.పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక, పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో XL రకానికి చెందిన ఉపగ్రహం. ఒక ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఏక కాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్ష కేంద్రంలో ప్రవేశ పెట్టడం ఇస్రోకు ఇదే మొదటి సారి. ఒకేసారి ఉపగ్రహ వాహకనౌక ద్వారా 29 ఉపగ్రహాలను ప్రయోగించి ద్వితీయ స్థానంలో అమెరికా ఉన్నది,2014lO okEsaa 37 ఉపగ్రహాలను ప్రయోగించి రష్యా మొదటి స్థానంలో ఉంది. 20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ద్వారా భారత దేశంలో మూడవ స్థానంలో నిలిచింది[1].ఇందులో మూడు ఉపగ్రహాలు, కార్గోశాట్-2సీ, సత్యభామశాట్, స్వయంశాట్ స్వదేశి ఉపగ్రహాలు కాగా, మిగిలిన 17 విదేశ ఉపగ్రహాలు.

పిఎస్ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహక నౌక నిర్మాణ వివరాలు

[మార్చు]

పిఎస్ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహక నౌక బరువు 320 టన్నులు. పొడవు 44.5 టన్నులు. వాహక నౌక 4 అంచెలు/ దశలు కలిగి ఉంది.మొదటి, మూడవ దశలో ఘన ఇంధనాన్ని, రెండవ, నాల్గవ దశలో ద్రవ ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తారు. మొదటి దశకు అదనంగా 6 స్ట్రాపాన్ మోటరులు అనుసంధానం చెయ్యబడి ఉన్నాయి. పిఎస్ఎల్‌వి-ఎక్సుఎల్ శ్రేణి రాకెట్ లలో పెద్దవైన, అధిక శక్తి వంతమైన స్ట్రాపాన్ బుస్టరు మోటరు లను ఉపయోగించడం వలన, ఈ రాకెట్ యొక్క మొదటి దశ/అంచె/స్టేజి యొక్క చోదకశక్తి ద్విగుణికృతం చెయ్యబడింది. PS1 అనబడు మొదటి దశ, ఘని ఇంధనం నింపబడిన S-138 రాకెట్ మోట రును కలిగి ఉంది, దీనికి బాహ్య వలయంలో ఆరు PS0M-XL బూష్టరులు అనుసంధానింపబడింది. ప్రతి స్ట్రాపాన్ బూస్టరు S-12 మోటరును కలిగి ఉంది.ఆరు స్ట్రాపన్ మోటారులలో మొత్తం 73.2 టన్నుల ఘన ఇంధనం నింపబడింది.మరి మొదటీదశ కోర్‌అలోన్ PS1లో 138.2టన్నుల ఘన ఇంధనం నింపారు. PS2 అనబడు రెండవ L-40 దశ, మొదటి దశ పైభాగాన ఉండును. ఇందులో ద్రవ ఇంధనంద్వారా పనిచేయు వికాస్ ఇంజను అమర్చబడి ఉంది. ఈ దశలో UH25మరియు డై నైట్రోజన్ టెట్రాక్సైడ్లు ద్రవచోదకం/ఇంధనంగా ఉపయోగిస్తారు.PS2లో 42 టన్నుల ద్రవ ఇంధనం నింపారు ఈ దశలోఉపయోగించు వికాస్ ఇంజను ఫ్రాన్స్ కు చెందిన వైకింగ్ ఇంజన్ (ఏరియన్ రాకెట్ సంస్థ ) నుండి లైసెన్సు తీసికొని ఇస్రో సంస్థ స్వంతగా భారతదేశంలో నిర్మించి ఉపయోగిస్తుంది. మూడవ దశ PS3. దీనిలో S-7 అను ఘన ఇంధనాన్ని మండించు రాకెట్ మోటరు అమర్చబడింది.PS3 లో 7.6టన్నుల ఘన ఇంధనం నింపారు. మూడవ దశపైన PS4అను నాల్గొవదశ తిరిగి ద్రవ ఇంధనం మండించు మోటరు కలిగిన దశ, ఇందులోద్రవ ఇంధనాన్ని మండించుటకు రెండు ఇంజన్లు అమర్చబడి ఉన్నవి[2].ఇందులో 2.5 టన్నుల ద్రవ ఇంధనం నింపారు.

పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ప్రయోగించబడు ఉపగ్రహ వివరాలు

[మార్చు]

కార్టోశాట్-2సీ

[మార్చు]

ఇస్రో సంస్థ 2005 సంవస్తరంలో భౌగోళిక సమాచారం కొరకు కార్టోశాట్ శ్రేణీ ఉపగ్రహాలను రూపొందించింది.ఈ వరుసలో కార్టోశాట్-1 ఉపగ్రహాన్ని 5 మే, 2005 లో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపారు.[3] ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములోకి పంపుటకై PSLV-C6 అను ఉపగ్రహ వాహకనౌకను ఉపయోగించారు. ఉపగ్రహం యొక్క కక్ష్యఆవర్తన సమయం 97 నిమిషాలు. భూమినుండి కక్ష్య 618 కిలోమీటర్లు (సూర్యానువర్తన దృవీయ కక్ష్య). ఈ ఉపగ్రహం ఒక రోజులో చెయ్యు ప్రదిక్షణల సంఖ్య 14. ఉపగ్రహ జీవితకాలం 5 సంవత్సరాలు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం యొక్క మొత్తం భారం (ఉపగ్రహం లోని ఇంధన సమేతంగా) 1560 కిలోలు. భూమధ్య రేఖను దాటునపుడు స్థానిక సమయం 10:30 గంటలు.కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని జనవరి 10,2007 లో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట లోని సతీష్ థవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి, పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక శ్రేణికి చెందిన PSLV-C7 అను ఉపగ్రహ వాహక నౌక సహాయముతో ఇస్రో వారి ఆద్వర్యంలో విజయవంతంగా ప్రయోగించారు. కార్టోశాట్-2A ఉపగ్రహాన్ని 28 ఏప్రిల్, 2008వ సంవత్సరం, ఆంధ్రప్రదేశ్ లోని, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని సతీష్ థావన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు. కార్టోశాట్-2B ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోట లోఉ న్నటువంటి సతీష్ థావన్ మొదటి లాంచ్ ప్యాడ్ నుండి 12జులై సోమవారం,2010 న అంతరిక్షములోకి పంపారు. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశ పెట్టుటకై PSLV శ్రేణికి చెందిన PSLV–C15 అను ఉపగ్రహ వాహక నౌకను ఉపయోగించారు.

కార్టోశాట్-2సీ ఉపగ్రహం బరువు 727 కిలోలు. ఈ ఉపగ్రహం భూమికి 505 కి.మీ ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యలో ఉండి పనిచేయును. ఉపగ్రహంలో అమర్చిన అత్యంత శక్తివంతమైన పాంక్రోమాటిక్ అండ్ మల్టి స్పెక్ట్రల్ చిత్రగ్రహిణి/కెమరా చాయా చిత్రాలను తీసి భూమికి పంపును. ఈ చాయాచిత్రాల ఆధారంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీరప్రాంతపు భూముల సమాచారంతో పాటు సాగునీటి పంపిణి, రోడ్డు నెట్‌వర్క్ సమాచారం లభిస్తుంది. అలాగే చిత్రపటాలను/మ్యాప్ లను తయారు చేస్తుంది.కార్టోశాట్-2సీ ఉపగ్రహం జీవిత కాలం 5సంవత్సరాలు[2]

లపాన్-ఏ3

[మార్చు]

లపాన్-ఏ3 అను ఇండోనేషియాకు చెందిన ఈ చిన్న ఉపగ్రహం బరువు 120 కిలోలు మాత్రమే.ఈ మల్టిస్పెక్ట్రల్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని భూమి వినియాగం, సహజ వనరులు, వాతావరణ పరిశోధనకు ఉపయోగించుకోనున్నారు[4].

బిరోస్

[మార్చు]

బిరోస్ ఉపగ్రహం జర్మనీకి చెందిన చిన్న సైంటిపిక్ ఉపగ్రహం.దీని బరువు 130 కిలోలు.బిరోస్ అనగా బెర్లి ఇన్‌ఫ్రార్డ్ ఆప్టికల్ సిస్టం.దీనిని జర్మనీకిచెందిన జర్మన్ ఏరో స్పెస్‌సెంటర్ (డిఎల్‌ఆర్) రూపొందించింది.అధిక ఉష్ణోగ్రతలను తెలుపు పరికారాలను ఈ ఉపగ్రహంలో అమర్చారు.అంతరిక్షం ఉష్ణోగ్రతలను తెలుసుకొణుటకు ఈ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తారు[4].

ఎం-3ఎంశాట్

[మార్చు]

ఎం-3ఎంశాట్ ఉపగ్రహం కెనడా దేశానికి చందిన ఉపగ్రహం.మార్టిటైమ్‌ మానిటరింగ్‌ అండ్‌ మెసెజింగ్ మైక్రొ శాటిలైట్ సంక్షిప్త పదం ఎం-3ఎంశాట్ .ఈ ఉప్గ్రహాన్ని కెనడియన్ స్పేస్‌ ఏజెన్సి, డిఫెన్స్&అండ్ డెవలప్‌మెంట్ (కెనడా) సంయుక్తంగా తయారు చేశాయి.ఈ ఉపగ్రహం బరువు 85 కిలోలు.ఈ ఉపగ్రహం అటోమేటిక్ ఐడెంటిఫికెసన్‌ సిస్టం సంకేతాలను అందిస్తుంది[4].

జీహెచ్‌జీశాట్-డీ

[మార్చు]

జీహెచ్‌జీశాట్-డీ ఉపగ్రహం కూడా కెనడా దేశానికి సంబంధించిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహాన్ని కెనడాలోని స్పేస్‌ ఫ్లైట్‌ ల్యాబోరెటరీ, యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో^ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ ఏరోస్పెస్ స్టడిస్ సంయుక్తంగా తయారు చేశాయి.ఈ ఉపగ్రహంబరువు 25.5 కిలోలు.ఈ ఉపగ్రహంలో అమర్చిన పరికరాలు వాతావరణంలోని గ్రీన్‌హౌస్‌ వాయువుల (కార్బన్ డయాక్సైడ్, మీథెన్) ను కొలచి, సమాచారాన్ని అందిస్తాయి[4].

స్కైశాట్ జెన్‌2-1

[మార్చు]

ఈ చిన్న ఉపగ్రహం అమెరికాకు చెందినది.ఈ ఉపగ్రహం బరువు 110 కిలోలు.ఈ ఉపగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టెర్రాబెల్లా, గూగుల్‌ కంపెనీ తయారు చేసాయి.ఈ ఉపగ్రహం భూమిని పరిసోధిస్తూ పోటోలు, హైక్వాలిటీ వీడియోలు తీసి పంపుతాయి.భూమ్మిద జరిగే మార్పులను ఎప్పటికప్పుడు సబ్‌-మీటరు రెజుల్యుసని ఇమేజెస్‌, హెచ్‌డిక్వాలిటి వీడియోలు తీసి భూమికి పంపును[4].

డౌవ్ శాటిలైట్స్

[మార్చు]

ఈ ఉపగ్రహం కూడా అమెరికా దేశానికి చెందినది.ఇది ఒక 12సూక్ష్మ/బుల్లి ఉపగ్రహలను కలిగిన సమూహం.ఒక్కోబుల్లిఉపగ్రహం బరువు 4.7 కిలోలు.ఇవి క్షక్ష్యలో పావురాల్ల తిరుగుతూ పనిచేస్తాయని డౌవ్ శాటిలైట్స్ అని పేరు పెట్టారు.ఈ బుల్లి ఉపగ్రహాలు కూడా భూమిని పరిశోధిస్తూ మార్పులను పోటోలు తీసి పంపును.[5]

సత్యభామ శాట్

[మార్చు]

సత్యభామ శాట్ ఒక సూక్ష్మ ఉపగ్రహం.దీని బరువు కేవలం 1.5 కిలోలు.దీనిని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లోని పాతమహాబలిపురం రోడ్డులోఉన్న సత్యభామ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఏరోస్పెస్ చదువుతున్న విద్యార్థులు తయారు చేసారు.ఈ ఉపగ్రహంలోఅమర్చిన పరికరాలు గ్రీన్‌హౌస్ వాయువుల సమాచారాన్ని సేకరిస్తుంది.ముఖ్యంగా నీటి ఆవిరి, కార్బన్ మొనాక్సైడ్.మీథేన్, హైడ్రొజన్ ఫ్లోరైడ్కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది.[6]

స్వయంశాట్

[మార్చు]

ఇది కూడా ఒక సూక్ష్మ ఉపగ్రహం .దీని బరువు కేవలం 1కిలో మాత్రమే.దీనిని పూణె ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసారు.ఇందులో అమర్చిన పరికరాలు పాయింట్‌ టు పాయింట్‌ మెసేజింగ్‌ సర్వీస్ అందిస్తాయి[6].[7]

పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వివరాలు

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ34 ఉపగ్రహ వాహకనౌక నుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుజిల్లాకు చెందిన శ్రీహరికొటలోని సతిష్ ధవన్ అంతరిక్షకెంద్రంలోని రెండవ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.ఉపగ్రహవాహకనౌక ప్రయోగ కౌంట్‌డవున్ సోమవారంజూన్20, సోమవారం2016 ఉదయం 9.25 గంటలకు మొదలైనది.48 గంటల విజయవంతమైన కౌంట్‌డౌన్ తరువాత, బుధవారం జూన్22,2016న ఉదయం 9.25గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది.ప్రయోగం విజయవంతంగా జరిగింది.అనుకున్న విధంగా 20 ఉపగ్రహాలను క్షక్యలో ప్రవేశపెట్టడం జరిగింది. రాకెట్ ప్రయోగ కేంద్రంనుండి బయలు దేరిన16 నిమిషాల 30సెకన్ల తరువాత,508 కి.మీ ఎత్తులో, భూమధ్యరేఖకు 97.5 డిగ్రీలకోణంలో ఉపగ్రహాలను ద్రువీయ సుర్యానువర్తన క్షక్ష్యలో ప్రవేశపెట్టబడినవి[8] ఉపగ్రహవాహకనౌక ప్రయోగ కేంద్రంనుండి బయలు దేరిన 17:07 నిమిషాలకు, భూమికి 508 కిలోమీటర్లేత్తులో భారతీయ ఉపగ్రహం కార్టోశాట్-2సీని కక్షలో ప్రవేశపెట్టినది.17:42 నిమిషాలకు చెన్నై, పుణే విద్యార్థులు తయారుచేసిన సత్యభామ, స్వయంశాట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడం జరిగింది.18:23 నిమిషాలకు ఇండోనేషియాకు చెందిన లపాన్-ఏ3, జర్మనీకి చెందిన బిరోన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి వెళ్ళినవి.19 నిమిషాలకు కెనడాకు చెందిన ఎం3ఏంసాట్, అమెరికా గూగుల్ సంస్థకు చెందిన స్కైశాట్ ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశపెటబడినవి. 19::22నిమిషాలకు కేడాకు చెందిన జీఎచ్‌బీశాట్ ఉపగ్రహం కక్ష్యలో ప్రవేశపెట్టబడింది.26:20 నిమిషాలకు అమెరికాకు చెందిన 12 డవ్‌శాటిలైట్‌లు కక్ష్యలో ప్రవేశపెట్టబడినవి.మొత్తం 26:20 నిమిషాల్లో ప్రయోగంముగిసినది.[1]

మొదటి దశ 108 సెకన్లకుపూర్తయ్యింది. రెండవదశ 260 సెకన్లకు, మూడవ దశ 491 సెకన్లకు.నాల్గవదశ 987 సెకన్లకు పూర్తయినది.

బయటి లింకుల విడీయో

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

పిఎస్‌ఎల్‌వి-సీ38

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఒకేసారి 20ఉపగ్రహాలు". sakshi.com. 2016-06-23. Archived from the original on 2016-06-23. Retrieved 2016-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "PSLV-C34/CARTOSAT" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-11-30. Retrieved 2016-06-22.
  3. "PSLV-C6 launched from Sriharikota". The Economic Times. India. 5 May 2005. Retrieved 18 September 2012.[permanent dead link]
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "ISRO's PSLV-C34 to launch Google-made satellite SkySat Gen2-1 on June 22". financialexpress.com. Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "12 DOVES LAUNCHING TO 500KM SSO". planet.com. Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. 6.0 6.1 "Ten things you must know about Isro's record launch of 20 satellites". hindustantimes.com. Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "TLE of Swayam". coep.org.in. Archived from the original on 2016-06-22. Retrieved 2016-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "PSLV-C34 Successfully Launches 20 Satellites in a Single Flight". isro.gov.in. Archived from the original on 2016-07-23. Retrieved 2016-06-22.