పిఎస్‌వి గరుడ వేగ | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ సత్తారు |
స్క్రీన్ ప్లే | ప్రవీణ్ సత్తారు |
కథ | ప్రవీణ్ సత్తారు నిరంజన్ రెడ్డి |
నిర్మాత | ఎం.కోటేశ్వర్ రాజు |
తారాగణం | రాజశేఖర్ (నటుడు) శ్రద్దా దాస్ |
ఛాయాగ్రహణం | అంజి,సురేష్ రఘుతు, శ్యామ్ ప్రసాద్, బకూర్ చికోబవా[1] |
సంగీతం | భీమ్స్ సెసిరోలియో, శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ |
విడుదల తేదీ | 3 నవంబరు 2017 |
సినిమా నిడివి | 158 Mins |
భాష | తెలుగు |
పిఎస్‌వి గరుడ వేగ 2017 నవంబరు 3న విడుదలైన తెలుగు సినిమా.[2][3][4]
నిరంజన్ అయ్యర్(ఆదిత్ అరుణ్) ఓ విలువైన సమాచారాన్ని ఎవరికో ఇవ్వడానికి ఇంటర్నెట్ ద్వారా బేరసారాలు చేస్తుంటాడు. అయితే నిరంజన్‌ను కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్ శేఖర్(రాజశేఖర్)కు వృత్తి అంటే ప్రాణం. తను చేసే పనిని ఎవరికీ చెప్పడు..చెప్పుకోకూడదు. కాబట్టి తన భార్య, పిల్లాడుతో సమయాన్ని కేటాయించలేకపోతుంటాడు. దాంతో శేఖర్ భార్య స్వాతి(పూజా కుమార్), అతని నుండి విడిపోవాలనుకుంటుంది. ఓ రహస్య ఆపరేషన్‌లో భాగంగా శేఖర్, నిరంజన్‌ని అరెస్ట్ చేస్తాడు. శేఖర్, నిరంజన్‌ని చంపాలని కొంత మంది ప్రయత్నిస్తారు. అసలు వారెవరు? నిరంజన్ దగ్గరున్న సమాచారం ఏమిటి? నిరంజన్‌ను శేఖర్ కాపాడాడా? జార్జ్ ఎవరు? జార్జ్‌కు, శేఖర్‌కు సంబంధం ఏంటి? అనే విషయాలు కథలో భాగంగా సాగుతాయి.
గరుడ వేగ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు చిత్ర నిర్మాతలకు, దర్శకుడికి, యూట్యూబుకి ఏప్రిల్ 12, 2018 న సమన్లు జారీ చేసింది. హైదరాబాదుకు చెందిన యురేనియం కార్పొరేషన్ ఈ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది.[5]