వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జనన తేదీ | 1935 డిసెంబరు 24 | ||||||||||||||||||||||
జనన ప్రదేశం | హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) | ||||||||||||||||||||||
మరణ తేదీ | 2008 నవంబరు 24 | (వయసు 72)||||||||||||||||||||||
మరణ ప్రదేశం | బొకారో స్టీల్ సిటీ, భారతదేశం | ||||||||||||||||||||||
ఎత్తు | 1.90 మీ. (6 అ. 3 అం.) | ||||||||||||||||||||||
ఆడే స్థానం |
గోల్ కీపర్ (ఫుట్‌బాల్) సెంటర్ ఫార్వర్డ్ (అప్పుడప్పుడు) | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||
భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు | ? | (1[1]) | |||||||||||||||||||||
Honours
| |||||||||||||||||||||||
† Appearances (Goals). |
హవల్దార్ పీటర్ తంగరాజ్ (1935 డిసెంబరు 24 - 2008 నవంబరు 24) (ఆంగ్లం: Peter Thangaraj) ఒక భారతీయ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇండియన్ ఆర్మీలో నాన్ కమీషన్డ్ ఆఫీసర్ (NCO).[2] పీటర్ తంగరాజ్ 1956 మెల్‌బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ జట్టు తరపున ఆడాడు.[3] అతను 1958లో ఆసియా అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికయ్యాడు.[4] పీటర్ తంగరాజ్ 1967 సంవత్సరానికి అర్జున అవార్డు గ్రహీత.[5]
పీటర్ తంగరాజ్ 1935లో హైదరాబాదు రాష్ట్రంలో జన్మించాడు. అతను తన ఫుట్‌బాల్ కెరీర్‌ను మార్నింగ్ స్టార్ క్లబ్, ఫ్రెండ్స్ యూనియన్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాదులలో ప్రారంభించాడు. అతను 1953లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. అతను మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను సెంటర్ ఫార్వర్డ్‌గా ఆడాడు, కానీ గోల్ కీపింగ్‌లో గొప్ప విజయం సాధించాడు. మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ 1955లో, 1958లో డ్యూరాండ్ కప్‌ను గెలుచుకుంది. 1960లో సంతోష్ ట్రోఫీలో తొలిసారిగా విజయం సాధించిన సర్వీసెస్ జట్టుకు తంగరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సర్వీసెస్‌ను విడిచిపెట్టిన తర్వాత, పీటర్ తంగరాజ్ కోల్‌కతా దిగ్గజాలు మొహమ్మదన్ స్పోర్టింగ్ (1960–63, 1971–72), మోహన్ బగాన్ (1963–65), ఈస్ట్ బెంగాల్ (1965–71) కోసం ఆడి అతను క్రీడాఅభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. అతను 1963లో సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న బెంగాల్ జట్టులో సభ్యుడు. తరువాత, అతను 1965లో రైల్వేస్‌కు నాయకత్వం వహించి వారికి సంతోష్ ట్రోఫీని అందించాడు. చుని గోస్వామి, పి. కె. బెనర్జీ వంటి వారితో పాటు, 1960, 70 లలో పీటర్ తంగరాజ్ భారత జట్టుకు ప్రధాన ఆటగాళ్లలో ఒకడు.
1955లో డాకాలో జరిగిన క్వాడ్రాంగులర్ టోర్నమెంట్‌లో భారత జట్టుతో పీటర్ తంగరాజ్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1956, 1960 ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున ఆడాడు. 1958 టోక్యో, 1962 జకార్తా, 1966 బ్యాంకాక్ ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ బంగారు పతకం సాధించింది. అతను 1958 నుండి 1966 వరకు కౌలాలంపూర్‌లో జరిగిన మెర్డెకా కప్ టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇజ్రాయెల్, బర్మాలో వరుసగా 1964, 1966 ఆసియా కప్‌లలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 1958లో ఆసియా అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. 1967లో అర్జున అవార్డును అందుకున్నాడు. భారత ఫుట్‌బాల్‌కు అతను చేసిన కృషిని గుర్తించి, అతనికి 1997లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది.[6] అతను రెండుసార్లు ఆసియన్ ఆల్-స్టార్ టీమ్‌కి ఆడాడు. 1967లో తిరిగి బెస్ట్ గోల్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. తంగరాజ్ 1971లో యాక్టివ్ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అయ్యాడు.[7][8]