పీలేరు | |
— జనగణన పట్టణం — | |
పీలేరు క్రాస్ రోడ్డు సెంటర్ | |
అక్షాంశరేఖాంశాలు: 13°39′23″N 78°55′54″E / 13.6565084°N 78.9316202°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | పీలేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 60,500 |
పిన్ కోడ్ | 517214 |
ఎస్.టి.డి కోడ్ | 08584 |
పీలేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పీలేరు మండలం లోని జనగణన పట్టణం, ఇది నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం.[1]
పీలేరు చిత్తూరు జిల్లా, పీలేరు మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం పీలేరు పట్టణంలో మొత్తం 10,536 కుటుంబాలు నివసిస్తున్నాయి. పీలేరు మొత్తం జనాభా 41,489 అందులో 20,677 మంది పురుషులుకాగా, 20,812 మంది స్త్రీలు ఉన్నారు.[2] సగటు లింగ నిష్పత్తి 1,007.పట్టణ మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4302, ఇది మొత్తం జనాభాలో 10% గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2266 మంది మగ పిల్లలు ఉండగా, 2036 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 898, ఇది సగటు లింగ నిష్పత్తి (1,007) కంటే తక్కువ.పీలేరు మొత్తం అక్షరాస్యత 83.2%. దీనిని అవిభాజ్య చిత్తూరు జిల్లా 71.5% అక్షరాస్యత శాతంతో పోలిస్తే పీలేరులో ఎక్కువ అక్షరాస్యత ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 89.58%, స్త్రీల అక్షరాస్యత రేటు 76.99%.
బస్ స్టాండు, ప్రభుత్య ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 7 సినిమా హాళ్ళు ఉన్నాయి.
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి యం.ఎల్.ఎగా కొనసాగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2010 నవంబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు పనిచేశాడు
ఇక్కడి ప్రజలు సాధారణంగా రవాణా కొరకు రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారి సంఖ్య 18, 205 పీలేరు పట్టాణం గుండా ఉండడం చేత ఇక్కడి నుంచి రాష్ట్ర నలు మూలలకీ బస్సు సౌకర్యం ఉంది. పట్టణంలో కల ఏకైక రైలు మార్గం ప్రస్తుతం బ్రాడ్ గేజ్ గా మార్ఛడమైంది.పీలేరు రైల్వే స్టేషన్ పాకాల ధర్మవరం బ్రాడ్ గేజ్ మార్గంలో ఉంది. పీలేరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే ట్రైన్లు: తిరుపతి అమరావతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ , కాచిగూడ మదురై ఎక్స్‌ప్రెస్, తిరుపతి గుంతకల్లు పాసింజర్, తిరుపతి కదరిదేవరపల్లి పాసింజర్.
క్రాస్ రోడ్డు, బస్ స్టాండ్, పంచాయతి ఆఫీస్, హాస్పిటల్, షిర్డీ సాయిబాబా గుడి, కాలేజి సెంటర్, ఝండామాను, శివాలయం సెంటర్, పాత బస్టాండ్, యల్లమంద క్రాస్, తిరుపతి రోడ్, చిత్తూరు రోడ్, పద్మావతి నగర్
సమీపంలోని చూడదగ్గ ప్రదేశాలు తలకోన, హార్సిలీ హిల్స్, తిరుమల, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి.