పుండరీకుడు | |
---|---|
అనుబంధం | వర్కారి |
పుండరీకుడు లేదా పుండలీకుడు విఠోబా కు సంబంధించిన పురాణాల్లో కనిపించే చెందిన ఒక భక్తశిఖామణి. ప్రస్తుతం పండరీపురంలో నెలకొన్న వైష్ణవ దేవుడైన విఠోబాను ఈయనే భూమిపైకి రప్పించాడని భక్తుల విశ్వాసం. విఠోబాను ప్రధాన దైవంగా పూజించే వర్కారీ సంప్రదాయాన్ని కూడా ఈయనే ప్రారంభించాడు.
పుండరీకుడు కుండలిని సాధన చేసిన అత్యంత ప్రాచీనమైన వ్యక్తి కూడా. కుండలినీ శక్తిని గ్రహించినవాడు కాబట్టి ఆయనను కుండలీకుడు అని కూడా అనేవారు. ఆ కుండలీకుడు కొద్దికాలానికి పుండలీకుడు అయ్యింది. ఈయన పండరీపుర ఆలయంలో ఉన్న మూలమార్తిని విష్ణువు లేదా కృష్ణుడి అవతారం కాదనీ, అది కుండలినీ శక్తికి ప్రతీక అని అభివర్ణించాడు.
విఠోబా నిలుచున్న ఇటుక మూలాధార చక్రానికి ప్రతీక. విల్లులా వెనుకకు వంగిన చేతులు ఇడ, పింగళ నాడులు. అవి రెండు శరీర మధ్య భాగమైన సుషుమ్న లేదా బ్రహ్మనాడి దగ్గర కలుసుకుంటాయి. శరీరం విశ్వమంతా నిండిఉన్న శక్తికి స్త్రీ స్వరూపం. పైన ఉన్న లింగం పురుష ప్రకృతికి నిదర్శనం. ధ్యానం ద్వారా కుండలినీ మేల్కొన్నపుడు ఆ శక్తి తలపైనున్న సహస్ర చక్రాన్ని చేరుకుంటుంది.
ఆయనకు రాజులు, కులీనులు పుండరీకునికి భక్తులుగా ఉండేవారు. వారే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. తరతరాలుగా వస్తున్న కుండలినీ సాధన ఈ క్షేత్రాన్ని పవిత్రంగా మార్చింది. ప్రపంచం నలుమూలల నుంచి సత్యాన్వేషులంతా ఇక్కడికి వచ్చి భక్తి మార్గం ద్వారా తమ కుండలినీ శక్తిని తెలుసుకున్నారు.
పాండురంగ మహత్యం (1957) సినిమా ఈతని జీవితచరిత్ర ఆధారంగా నిర్మించబడినది. ఇందులో పుండరీకునిగా నందమూరి తారక రామారావు నటించాడు.