Puducherry Legislative Assembly Assemblée législative de Pondichéry | |
---|---|
15th Puducherry Assembly | |
![]() | |
రకం | |
రకం | Unicameral |
కాల పరిమితులు | 5 years |
చరిత్ర | |
స్థాపితం | 1 జూలై 1963 |
అంతకు ముందువారు | Puducherry Representative Assembly |
నాయకత్వం | |
Leader of the House (Chief Minister) | |
నిర్మాణం | |
సీట్లు | 30 (elected) + 3 (nominated) |
![]() | |
రాజకీయ వర్గాలు | Government (22)
Nominated (3)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | First-past-the-post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 6 April 2021 |
తదుపరి ఎన్నికలు | 2026 |
సమావేశ స్థలం | |
![]() | |
Puducherry Legislative Assembly | |
వెబ్‌సైటు | |
https://puddu.neva.gov.in/ |
పుదుచ్చేరి శాసనసభ, (ఫ్రెంచ్:అస్సాంబ్లే లెజిస్లాతివ్ దె పోందిషేరి) అనేది పుదుచ్చేరి భారత కేంద్రపాలిత ప్రాంతం (యుటి) ఏకసభ శాసనసభ. ఇది పుదుచ్చేరి, కారైకల్, మాహె, యానాం అనే నాలుగు జిల్లాలను కలిగి ఉంది. భారతదేశం లోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో, కేవలం మూడింటికి మాత్రమే శాసనసభలు ఉన్నాయి. అవి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. పునర్విభజన తర్వాత పుదుచ్చేరి శాసనసభలో 33 స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. 33 మంది సభ్యులలో 30 మంది సార్వత్రిక వయోజనల ఓటింగు ఆధారంగా ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు. మిగిలిన ముగ్గురు కేంద్రప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు. ఈ నామినేటెడ్ సభ్యులుకు, శాసనసభకు ఎన్నికైన మిగతా సభ్యులతో సమానమైన అధికారాలను కలిగి ఉంటారు.
భౌగోళికంగా, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కింద మూడు విడదీయబడిన ప్రాంతాలను కలిగి ఉంది. పుదుచ్చేరి, కారైకాల్ జిల్లాలు తమిళనాడు జిల్లాలతో చుట్టుముట్టబడ్డాయి. యానాం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఎన్‌క్లేవ్‌గా, మాహే జిల్లా కేరళ జిల్లాల సరిహద్దులో ఉంది. 1962లో భారతదేశంలో విలీనం కావడానికి ముందు ఈ నాలుగు జిల్లాలు ఫ్రెంచ్ వారిచే పాలించబడ్డాయి. పరిపాలన సౌలభ్యం కోసం, ఫ్రెంచ్ పాలనలో, ఈ నాలుగు జిల్లాల పరిధిలోని ప్రాంతాన్ని 39 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించారు. భారతదేశ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత, పుదుచ్చేరి 30 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది. వీటిని 2005లో డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరించింది.
1946లో, ఫ్రెంచ్ ఇండియా (ఏంద్ ఫ్రాన్సేస్) ఫ్రాన్స్‌కు చెందిన ఓవర్సీస్ టెరిటరీ (తెర్రిత్వార్ దూత్ర్ మేర్) గా మారింది. అప్పుడు ఒక ప్రతినిధి సభ అనే పేరుతో (అసెంబ్లీ ప్రతినిధి) సృష్టించబడింది. ఆ విధంగా 1946లో అక్టోబరు 25న, 44 మంది సభ్యులతో కూడిన ప్రాతినిధ్యసభ సాధారణ మండలి (కొన్సైయ్ జెనెరాల్) స్థానంలో ఏర్పడింది.[2] 1951లో చందర్‌నాగోర్ విలీనం అయ్యేవరకు ప్రతినిధుల శాసనసభకు 44 స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత 39 స్థానాలకు తగ్గాయి.
1963 మే 10న, భారత పార్లమెంటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం, 1963ను అమలులోకి తెచ్చింది. అది 1963 జూలై 1న అమల్లోకి వచ్చింది. ఇది దేశం లోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అదే ప్రభుత్వ విధానాన్ని కొన్ని పరిమితులకు లోబడి ప్రవేశపెట్టింది.[3] భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ప్రకారం, భారత రాష్ట్రపతి భూభాగం పరిపాలనకు అధిపతిగా పేర్కొనే లెఫ్టినెంట్ గవర్నరు అనే హోదాతో పరిపాలనా నిర్వాహకుడను నియమిస్తారు. ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తాడు. కేంద్రపాలిత ప్రాంతాల చట్టం, 1963 ప్రకారం శాసనసభకు ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్యను 30కి పరిమితం చేసింది. కేంద్రప్రభుత్వం ముగ్గురు నామినేటెడ్ శాసనసభ్యులకు మించకుండా నియమించడానికి అనుమతిస్తుంది. శాసనసభలో షెడ్యూల్డ్ కులాలకు సీట్లు కేటాయింపు చేయబడేలా అదే చట్టం నిర్ధారిస్తుంది.
1963 జూలై 1న కేంద్రపాలిత ప్రాంతాల చట్టం, 1963 సెక్షన్ 54 (3) ప్రకారం ప్రాతినిధ్య అసెంబ్లీని పాండిచ్చేరి శాసనసభగా మార్చారు,[3][4] దాని సభ్యులు శాసనసభకు ఎన్నికైనట్లుగా భావించారు. ఆ విధంగా మొదటి శాసనసభ ఎన్నికలు లేకుండా ఏర్పడింది. 1964 నుండి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
చాలా తక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు శాసన సభకుు నామినేట్ చేసన శాసనసభ్యులను కలిగి ఉన్నాయి. పుదుచ్చేరి మాత్రమే మినహాయింపుతో వారి ఓటింగ్ అధికారాలు పరిమితం చేయబడ్డాయి. 2021లో భారత అత్యున్నత న్యాయస్థానం నామినేటెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు ముఖ్యమైన అంశాలను స్పష్ట చేసింది. మొదటిది వారి నామినేషన్ గురించి, 1963 చట్టం ప్రకారం పుదుచ్చేరి ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే శాసనసభ్యులను నామినేట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని కోర్టు పేర్కొంది. రెండవది నామినేటేడ్ శాసనసభ్యుల ఓటుహక్కుకు సంబంధించింది [5] 1963 చట్టం ప్రకారం నామినేటేడ్ శాసనసభ్యులకు ఎన్నికైన మిగతా శాసనసభ్యుల మధ్య తేడా లేదు కాబట్టి, నామినేటెడ్ శాసనసభ్యులకు కూడా ఎన్నికైన శాసనసభ్యుతో సమానంగా ఓటింగ్ అధికారాన్ని పొందుతారని కోర్టు పేర్కొంది.[6]
ఆధారం:[4]: 967
Election Year | Assembly | Period | Ruling Party | |
---|---|---|---|---|
1963 | 1వ పుదుచ్చేరి శాసనసభ | 1963 జూలై 1 - 1964 ఆగస్టు 24 | Indian National Congress | |
1964 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు | 2వ పుదుచ్చేరి శాసనసభ | 1964 ఆగస్టు 29 - 1968 సెప్టెంబరు 18 | Indian National Congress | |
1969 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 3వ పుదుచ్చేరి శాసనసభ | 1969 మార్చి 17 - 1974 జనవరి 3 | Dravida Munnetra Kazhagam | |
1974 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 4వ పుదుచ్చేరి శాసనసభ | 1974 మార్చి 6 - 1974 మార్చి 28 | All India Anna Dravida Munnetra Kazhagam | |
1977 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 5వ పుదుచ్చేరి శాసనసభ | 1977 జూలై 2 - 1978 నవంబరు 12 | All India Anna Dravida Munnetra Kazhagam | |
1980 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 6వ పుదుచ్చేరి శాసనసభ | 1980 జనవరి 16 - 1983 జూన్ 24 | Dravida Munnetra Kazhagam | |
1985 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 7వ పుదుచ్చేరి శాసనసభ | 1985 మార్చి 16 - 1990 మార్చి 5 | Indian National Congress | |
1990 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 8వ పుదుచ్చేరి శాసనసభ | 1990 మార్చి 5 - 1991 మార్చి 4 | Dravida Munnetra Kazhagam | |
1991 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 9వ పుదుచ్చేరి శాసనసభ | 4 జూలై 991 - 1996 మే 14 | Indian National Congress | |
1996 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 10వ పుదుచ్చేరి శాసనసభ | 1996 జూలై 10 - 2000 మార్చి 21 | Dravida Munnetra Kazhagam | |
2000 మార్చి 22 - 2001 మే 16 | Indian National Congress | |||
2001 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 11వ పుదుచ్చేరి శాసనసభ | 2001 మే 16 - 2006 | Indian National Congress | |
2006 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 12వ పుదుచ్చేరి శాసనసభ | 2006 - 2011 | Indian National Congress | |
2011 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 13వ పుదుచ్చేరి శాసనసభ | 2011 - 2016 | All India N.R. Congress | |
2016 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 14వ పుదుచ్చేరి శాసనసభ | 2016 - 2021 ఫిబ్రవరి 22[7] | Indian National Congress | |
2021 పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు ⋅ | 15వ పుదుచ్చేరి శాసనసభ | 2021 జూన్ 16[8] - ఇప్పటివరకు | All India N.R. Congress |
రాజకీయపార్టీలు వారిగా పుదుచ్చేరి శాసనసభ సభ్యులు (28.06.2022 నాటికి):
కూటమి | పార్టీ | ఎమ్మెల్యేలు | శాసనసభా పక్ష నాయకుడు | పాత్ర | |||
---|---|---|---|---|---|---|---|
NDA (22) | AINRC | 10 | ఎన్. రంగసామి [9] | ప్రభుత్వం | |||
బీజేపీ | 6 | నమశ్శివాయం [10] | |||||
IND | 6 | ||||||
యుపిఎ (8) | డిఎంకె | 6 | ఆర్. శివ [11] | వ్యతిరేకత | |||
INC | 2 |
{{cite book}}
: ISBN / Date incompatibility (help)