పూజ (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మురగన్ కుమరన్ |
---|---|
తారాగణం | జి.రామకృష్ణ , వాణిశ్రీ, కన్నడ మంజుల, సావిత్రి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని, కృష్ణకుమారి, రేలంగి, అల్లు రామలింగయ్య, కె.వి.చలం |
సంగీతం | రాజన్-నాగేంద్ర |
గీతరచన | దాశరథి, కొసరాజు |
సంభాషణలు | ఎన్.ఆర్.నంది |
నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పూజ 1975లో విడుదలైన ఒక సంగీతప్రథమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, కన్నడ మంజుల, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు. రేలంగి వెంకట్రామయ్య నటించిన చివరి చిత్రం ఇది.[1]
జి. రామకృష్ణ, మంజుల ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణకు వాణిశ్రీకి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ, వాణిశ్రీతో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ మంజులని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా మంజుల ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణకు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీని ఆదరిస్తాడు.