పూనమ్ సిన్హా | |
---|---|
జననం | పూనమ్ చండీరమణి |
ఇతర పేర్లు | కోమల్ |
వృత్తి |
|
రాజకీయ పార్టీ | సమాజ్వాదీ పార్టీ |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 3, సోనాక్షి సిన్హా, లవ్ సిన్హా లతో సహా |
పూనమ్ సిన్హా భారతీయ రాజకీయవేత్త, మాజీ నటి, మోడల్. ఆమె తన కెరీర్ ప్రారంభంలో కోమల్ అనే స్క్రీన్ పేరుతో హిందీ సినిమాలో నటించింది. ఆమె 1968లో మిస్ యంగ్ ఇండియా కిరీటాన్ని పొందింది. ఆమె ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాను వివాహం చేసుకుంది. ఆమె హిందీ సినిమా నిర్మాత కూడా.[1]
పూనమ్ సిన్హా హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించింది.[2]
జిగ్రీ దోస్త్, దిల్ దివానా.. ఇతర చిత్రాలతో సహా ఆమె హీరోయిన్గా నటించిన అన్ని చిత్రాలలో ఆమె కోమల్గా గుర్తింపు పొందింది. ఆమె సబక్ (1973) చిత్రంలో శత్రుఘ్న సిన్హాతో నటించింది. ఆ తర్వాత 1980లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె వివాహం తరువాత నటనా వృత్తికి దూరంగా ఉంది. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె తిరిగి జోధా అక్బర్ (2008) చిత్రంలో మల్లికా హమీదా బాను బేగం పాత్రను పోషించింది. ఇది అక్బర్ చక్రవర్తి తల్లి పాత్ర. కాగా అక్బర్ చక్రవర్తిగా హృతిక్ రోషన్ నటించాడు. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించాడు.
2019 ఏప్రిల్ 16న ఆమె సమాజ్ వాదీ పార్టీలో చేరింది. ఆమె భర్త శత్రుఘ్న సిన్హా బిజెపికి రాజీనామా చేసిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. ఆమె లోక్సభ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి పోటీచేసి[3] రాజ్నాథ్ సింగ్ చేతిలో ఓడిపోయింది.
ఆమె సహా నటుడు శత్రుఘ్న సిన్హాను 1980లో వివాహం చేసుకుంది. వారికి కవల పిల్లలు లవ్ సిన్హా, కుష్ సిన్హా, ఒక కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులతో పాటు తన తల్లిదండ్రులతో కలిసి మంబాయిలో నివసిస్తోంది.[4]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)