పూనా సార్వజనిక సభ, బ్రిటిష్ భారతదేశంలో స్థాపితమైన సామాజిక రాజకీయ సంస్థ. ప్రభుత్వానికి భారతదేశ ప్రజలకూ మధ్య మధ్యవర్తిత్వ సంస్థగా పనిచేయడం, రైతుల చట్టపరమైన హక్కులకు ప్రచారం కలిగించడం వంటి లక్ష్యాలతో ఈ సంస్థ ప్రారంభమైంది. [1] 1867 ఏప్రిల్ 2 న 6000 మంది వ్యక్తులచే ఎన్నికైన 95 మంది సభ్యుల సంఘంగా ఇది ప్రారంభమైంది. [2] మహారాష్ట్ర లోనే మొదలైన భారత జాతీయ కాంగ్రెస్‌కు ఈ సంస్థ పూర్వగామి. 1875 లో సభ బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశానికి ప్రత్యక్ష ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ పూనా సార్వజనిక సభ, హౌస్ ఆఫ్ కామన్స్‌కు పిటిషన్ పంపింది. బాల గంగాధర్ తిలక్ తో సహా జాతీయ స్థాయికి చెందిన ప్రముఖ నాయకులను భారత స్వాతంత్ర్య పోరాటానికి ఈ సభ అందించింది. దీన్ని 1867 లో గణేష్ వాసుదేవ్ జోషి స్థాపించాడు. [3]
సభ స్థాపనలో SH చిప్లూంకర్, మహాదేవ్ గోవింద రానడే కూడా పాలుపంచుకున్నారు.
ఔంధ్ సంస్థాన పాలకుడైన భావన్‌రావు శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి, ఈ సంస్థకు మొదటి అధ్యక్షుడు. [4] బాల గంగాధర్ తిలక్, గోపాల్ హరి దేశ్‌ముఖ్, మహర్షి అన్నాసాహెబ్ పట్వర్ధన్ మొదలైన అనేకమంది ప్రముఖులు సంస్థకు అధ్యక్షులుగా పనిచేసారు. [4]
2016 లో, మీరా పావగి సంస్థకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. [4]