వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పూర్ణిమ చౌదరి | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్ | 1971 అక్టోబరు 15||||||||||||||||||||||||||
మారుపేరు | పూర్ణి | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 53) | 1997 డిసెంబరు 13 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 డిసెంబరు 24 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 8 |
పూర్ణిమ చౌదరి పశ్చిమ బెంగాల్కి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]
పూర్ణిమ చౌదరి 1971, అక్టోబరు 15న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కలకత్తాలో జన్మించింది.
1997 డిసెంబరు 13న ఫరిదాబాదు వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. ఇందులో 13 బంతులలో 11 పరుగులు చేసింది. బౌలింగ్ లో 8 ఓవర్లు వేసి, 21 పరుగులు ఇచ్చి, 5 వికెట్లు తీసింది.[2]
కుడిచేతి బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా రాణించింది.[3] భారతదేశం తరపున ఐదు వన్డే అంతర్జాతీయవన్డే అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇరవై పరుగులు చేసింది. అరంగేట్రంలో ఐదు వికెట్లతో సహా మొత్తం ఆరు వికెట్లు పడగొట్టింది.[4][5]
1997 డిసెంబరు 24న ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]