వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పూర్ణిమ రావు | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సికింద్రాబాదు, తెలంగాణ | 1967 జనవరి 30|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 44) | 1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1999 జూలై 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 40) | 1993 జూలై 20 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 డిసెంబరు 20 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 27 అక్టోబరు 2021 |
పూర్ణిమ రావు (ఆంగ్లం: Purnima Rau) (జననం 1967 జనవరి 30) తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్. ఆమె భారతదేశం తరపున మహిళల టెస్ట్ క్రికెట్ (1993-1995 మధ్యకాలంలో 5 మ్యాచ్‌లు), అంతర్జాతీయ వన్డే క్రికెట్ (1993-2000 మధ్యకాలంలో 33 మ్యాచ్‌లు) ఆడింది.[1]
పూర్ణిమ 1967, జనవరి 30న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించింది.[2]
పూర్ణిమ భారత దేశవాళీ మహిళల క్రికెట్‌లో ఎయిర్ ఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. వాటితోపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా 3 టెస్ట్ మ్యాచ్‌లు, 8 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు ఆడింది. 1993, జూలై 20లో నాటింగ్‌హామ్‌లో జరిగిన ఇండియా ఉమెన్ - వెస్టిండీస్ ఉమెన్ అంతర్జాతీయ వన్డేతో పూర్ణిమ తన క్రికెట్ ఆటను ప్రారంభించింది.[3] పరిమిత ఓవర్ల ఆటలో మొదటి 15 ఓవర్లలో ఫీల్డ్ పరిమితులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించిన భారత మహిళా క్రికెట్‌లో మొదటి క్రీడాకారిణిగా పూర్ణిమ గుర్తింపు పొందింది.[3] 1996లో స్కిప్పర్ రావు టూరింగ్ ఆంధ్రప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు సముద్ర లేడీస్ సిసిపై 114 పరుగులతో విజయాన్ని సాధించడంలో సహాయపడింది.
అంతర్జాతీయ వన్డే ఇన్నింగ్స్‌లో చాలావరకు ఆల్ రౌండర్గా మిడిల్ ఆర్డర్‌లో ఆడింది, కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసింది. కొంతకాలం హైదరాబాద్‌లోని మహిళా క్రికెటర్లకు కోచ్‌గా ఉంది. తరువాత భారత మహిళల క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేసింది.[4] 2017 ఏప్రిల్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతల నుండి పూర్ణిమను తప్పించింది.