పెనమలూరు విజయవాడ నగరంలో ఒక ముఖ్య ప్రాంతం.ఇది విజయవాడ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, పెనమలూరు మండలంలో ఉంది. ఇది పెనమలూరు మండలానికి ప్రధాన కేంద్రం. పెనమలూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ నగరలోని ప్రాంతం. ఇది సముద్రమట్టానికి 19 మీ.ఎత్తులో ఉంది.
2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[1]
ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[2][3] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.
సిండికేటు బ్యాంకు:- ఈ గ్రామంలో సిండికేటు బ్యాంకు శాఖను, 2014, డిసెంబరు-17వ తేదీనాడు ప్రారంభించారు. ఇక్కడ ఖాతాదారులకు ఆధునిక సాంకేతిక పరిఙానంతోకూడిన సేవలను అందించెదరు.
పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- పెనమలూరులోని ఈ ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2014, జూన్-16 నుండి 19 వరకు నిర్వహించారు. 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఆ రోజున విష్వక్సేన ఆరాధన, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, తీర్ధగోష్ఠి తదితర పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించారు.17వ తేదీ ఉదయం, ధ్వజారోహణ, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం,18వ తేదీన హోమపూజలు 19వ తేదీన వసంతోత్సవం నిర్వహించారు
శ్రీ గంగానమ్మ ఆలయం:- ఈ పురాతన ఆలయం, పెనమలూరులోని గోగులమ్మ చెరువు ప్రక్కనే ఉంది.
సినీనటుడు కోట శ్రీనివాసరావు పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.
మండవ రిషిత:- పెనమలూరు గ్రామానికి చెందిన మండవ కోటేశ్వరరావు, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య రాజ్యలక్ష్మి గృహిణి. వీరు మధ్య తరగతి కుటుంబీకులు. ఈ దంపతుల కుమార్తె రిషిత, సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్.వైద్యకళాశాలలో చదివి ఎం.బి.బి.ఎస్.పూర్తిచేసింది. ఈమె విలువిద్యలో సవ్యసాచి. గురిచూసి బాణం వదిలితే లక్ష్యాన్ని ఛేదించినట్లే. విల్లు ఎక్కుపెడితే, పతకం ఆమె చేతిలో పడినట్లే. పెనమలూరు నుండి అంతర్జాతీయస్థాయిలో ఆర్చరీలో విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె విలువిద్యలోనేగాక అటు ఉన్నత విద్యలోగూడా రాణించి, ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసింది.
వెంకటేష్ కిలారు .(తెలుగుచలనచిత్ర రచయిత) I శ్రీ కిలారు సుబ్బారావు ,భవాని ల కుమారుడు. . వ్యవసాయ రంగానికి చెందిన కుటుంబం నుండి వచ్చి double M.A చదివి ఈనాడు లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించి,క్రమంగా సినీ రంగంలో ప్రవేశించి ,ఎన్నోచిత్రాలకు స్క్రిప్ట్ రచయితగా కథ,స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నారు, 2022లో వీరు కథ అందించిన "పులి మేక" webseries zee 5 OTT లో ప్రసారం అయి 200 millian minuits reviews సాధించి zee5 లో రికార్డు సృష్టించింది.భారతీయ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా TANA (telugu association of north America) వారు సన్మానించి అవార్డుతో గౌరవించారు. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఏర్పడి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా యువ రచయిత ప్రతిభ పురస్కారం అవార్డ్ ఇచ్చి సత్కరించింది .
↑"School Eduvation Department"(PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original(PDF) on 7 November 2016. Retrieved 7 November 2016.