పెళ్లిసందD | |
---|---|
![]() | |
దర్శకత్వం | గౌరి రోనంకి |
నిర్మాత | మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని |
తారాగణం | రోషన్, శ్రీలీల |
ఛాయాగ్రహణం | సునీల్ కుమార్ నామ |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ఆర్కా మీడియా & ఆర్.కె అసోసియేట్స్ |
దేశం | ![]() |
భాష | తెలుగు |
పెళ్లిసందD తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సినిమా. ఆర్కా మీడియా. ఆర్.కె అసోసియేట్స్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోనంకి దర్శకత్వం వహించింది. రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.[1][2]
వశిష్ట (రోషన్) బాస్కెట్ బాల్ ప్లేయర్, తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అతను ఒక పెళ్ళిలో ఫ్యాషన్ డిజైనర్ అయిన సహస్ర (శ్రీలీలా)ను చూసి ప్రేమలో పడతాడు. సహస్ర కూడా వశిష్టను ప్రేమిస్తుంది. తన అక్క (వితిక శేరు) జీవితం కోసం తండ్రి (ప్రకాష్ రాజ్)కి సహస్ర ఓ మాట ఇస్తుంది. సహస్ర తన తండ్రికి ఏమని మాట ఇస్తుంది? చివరకు వశిష్ట తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
పెళ్లిసందD లోని మొదటి లిరికల్ పాట 'ప్రేమంటే ఏంటి' ని 2021 ఏప్రిల్ 28న విడుదల కాగా రెండవపాట ‘బుజ్జులు బుజ్జులు...’ పాటను 23 మే 2021న విడుదల చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిచరణ్, శ్వేతా పండిట్ పాడారు. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు.[5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)