పెళ్ళి చేసుకుందాం | |
---|---|
![]() పెళ్ళి చేసుకుందాం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) |
కథ | భూపతి రాజా |
నిర్మాత | సి. వెంకట రాజు జి. శివరాజు |
తారాగణం | వెంకటేష్, సౌందర్య, లైలా |
ఛాయాగ్రహణం | కె. రవీంద్ర బాబు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | గీత చిత్ర ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 9 అక్టోబరు 1997 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెళ్ళి చేసుకుందాం 1997, అక్టోబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి. వెంకట రాజు, జి. శివరాజు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య, లైలా నటించగా కోటి సంగీతం అదించాడు. శీలం అనేది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించిదన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[1][2] 2001లో ఈ సినిమా శివ రాజ్‌కుమార్, లయ, శిల్పి ప్రధాన తారాగణంగా వి.ఎస్.రెడ్డి దర్శకత్వంలో కన్నడ భాషలో మదువె ఆగోణ బా అనే పేరుతో పునర్మించబడింది.
అత్యాచారానికి గురైన శాంతి (సౌందర్య) కు తోడుగా నిలిచిన ఒక లక్షాధికారి ఆనంద్ (వెంకటేష్) కథ ఈ పెళ్ళి చేసుకుందాం సినిమా. కాళీచరణ్ (మోహన్ రాజ్) చేసిన హత్యను చూసిన శాంతి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. దానికి ప్రతీకారంగా కాళీచరణ్ తమ్ముడు (సత్య ప్రకాష్) శాంతిపై అత్యాచారం చేస్తాడు. దాంతో తల్లిదండ్రులు శాంతిని ఇంటినుండి వెళ్ళగొడతారు. విషయం తెలిసిన ఆనంద్, శాంతిని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తాడు.
రోజులు గడుస్తున్నకొద్ది ఆనంద్, శాంతి ప్రేమలో పడతాడు. కానీ శాంతి అతణ్ణి దూరం పెడుతుంది. అదేసమయంలో ఆనంద్ మరదలు లైలా (లైలా) అమెరికా నుండి వచ్చి, ప్రేమిస్తున్నానంటూ ఆనంద్ వెంట పడుతుంది. ఆనంద్, శాంతిని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకుని లైలా అమెరికా వెళ్ళిపోతుంది. అన్ని అడ్డంకులు తొలగి ఆనంద్, శాంతి ఒక్కటవ్వడం మిగతా కథ.
పెళ్ళి చేసుకుందాం | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 1997 | |||
Genre | పాటలు | |||
Length | 28:25 | |||
Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
Producer | కోటి | |||
కోటి chronology | ||||
|
ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు. అన్ని పాటలు హిట్ అయ్యాయి. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[3]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓ లైలా లైలా (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | మనో, స్వర్ణలత | 4:37 |
2. | "కోకిల కోకిల (రచన: సాయి శ్రీ హర్ష)" | సాయి శ్రీ హర్ష | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:03 |
3. | "నువ్వేమి చేసావు నేరం (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె. జె. ఏసుదాసు | 4:48 |
4. | "ఎన్నో ఎన్నో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:20 |
5. | "మనసున మనసై (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:15 |
6. | "గుమ గుమలాడే (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:16 |
మొత్తం నిడివి: | 28:25 |
సంవత్సరం | సినిమాపేరు | భాష | నటవర్గం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1998 | ఎన్ ఉయిర్ నీ తానే | తమిళ | ప్రభు, దేవయాని, మహేశ్వరి | |
1999 | సుధూ ఎక్ బార్ బోలో | బెంగాలీ | ప్రోసెన్ జిత్ ఛటర్జీ, రితుపర్ణ సెంగుప్తా, మౌళి గంగూలీ | |
2001 | హమారా దిల్ ఆప్కే పాస్ హై | హిందీ | అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, సోనాలి బింద్రే | |
2001 | మవుడే ఆగోన బా | కన్నడ | శివ రాజ్‌కుమార్, లయ |
డబ్బింగ్