పైగా సమాధులు

పైగా సమాధుల దృశ్యం

పైగా సమాధులు లేదా మఖ్బారా షామ్స్ అల్-ఉమరా అన్నవి నిజాం రాజులకు తీవ్ర విధేయులుగా ఉంటూ వారి వద్ద రాజ్యతంత్ర నిపుణులుగా, సేనా నాయకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందిన సమాధులు.[1]

మొజాయిక్ పలకలు పరిచి, శిల్పనైపుణ్యానికి ప్రసిద్ధిచెందిన ఈ అపురూప నిర్మాణాలు హైదరాబాద్ రాజ్యం కాలంలో నిర్మించిన ప్రసిద్ధ కట్టడాల్లోనివి. పైగాల సమాధులు హైదరాబాద్ నగరంలో చార్మినార్ కు ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలోని పిసల్ బండ ప్రాంతంలో ఒవైసీ ఆసుపత్రి పక్క నుంచి సంతోష్ నగర్ వెళ్ళే చిన్న దారిలో నెలకొన్నాయి. సున్నం, మోర్టార్లతో నిర్మించా అందంగా పాలరాయి అమర్చి చెక్కి తయారుచేశారు. ఈ సమాధులు 200 సంవత్సరాల పూర్వం నాటివి, పలు తరాలకు చెందిన పైగా ప్రభువంశీకులను ఇక్కడ సమాధి చేశారు.[2]

మొట్టమొదట పైగా సమాధులు విసిరివేసినట్టు, పట్టించుకోని ప్రదేశంలా కనిపించినా అటువంటి స్థితిలోనూ అంత అందంగా కనిపిస్తున్న ఆ కళ గురించి క్రమంగా తెలుస్తుంది. అద్భుతమైన శిల్ప నైపుణ్యం, పూల డిజైన్లలో విశిష్టత, మొజాయిక్ పలకలు చేర్చిన పద్ధతి ఈ కట్టడాలకు అందం తీసుకువస్తోంది. సమాధులు, వాటి గోడలు సునిశితంగా చెక్కి, పాలరాతి ముక్కలతో అలంకరించారు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (6 November 2017). "వారసత్వ సంపదకు పూర్వవైభవం". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  2. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 21 April 2018.