పైసా వసూల్[1] | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ (story /screenplay /dialogues) |
నిర్మాత | వి. ఆనంద ప్రసాద్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ శ్రియా సరన్ |
ఛాయాగ్రహణం | ముకేష్. జి |
కూర్పు | జునైద్ సిద్దిఖి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1 సెప్టెంబరు 2017 |
సినిమా నిడివి | 142 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పైసా వసూల్ 2017లో విడుదలైన తెలుగు సినిమా.[3]
బాబ్ మార్లే(విక్రమ్ జీత్) ఓ పెద్ద అధో జగత్తు నేరగాడు (మాఫియా డాన్). పోర్చుగల్లో ఉంటాడు. బాబ్ తమ్ముడు సన్ని(అమిత్)ను భారతీయ నిఘా అధికారి చంపేస్తాడు. దాంతో మనదేశంపై పగబట్టిన బాబ్ ఇండియాలో మారణ హోమం సృష్టించేయాలని నిర్ణయించుకుంటాడు. బాబ్‌కు మనదేశంలో ఓ మంత్రి(కృష్ణకాంత్) సహా స్థానిక మాఫియా అండగా ఉంటుంది. హైదరాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయి. అమాయకులైన జనం చనిపోతారు. పోలీస్ అధికారులను మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. అలాంటి సమయంలో రా చీఫ్(కబీర్ బేడి), ఓ నేరగాడిని ఈ మాఫియాకు వ్యతిరేకంగా వాడుకుని అంతమొందించాలనుకుంటాడు. అందులో భాగంగా తేడాసింగ్(నందమూరి బాలకృష్ణ)తో పోలీస్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటుంది. తేడాసింగ్ తను ఉండే వీధిలో తన పక్కింట్లో ఉండే హారిక(ముస్కాన్) వెంటపడుతుంటాడు. హారిక తన అక్కయ్య సారిక(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది. పోర్చుగల్ వెళ్లిన సారిక కనపడకుండా పోతుంది. అయితే చివరకు హారికకు, తన అక్కయ్య సారికకు, తేడాసింగ్‌కు మధ్య ఓ సంబంధం ఉందని తెలుస్తుంది. ఆ సంబంధం ఏంటి? అసలు తేడా సింగ్ ఎవరు? సారిక, హారిక కుటుంబానికి తేడాసింగ్ ఎందుకు దగ్గరవుతాడు? అసలు సారిక ఏమవుతుంది? అనే విషయాలలు మిగిలిన కథలో భాగం.