పొగరు | |
---|---|
![]() | |
దర్శకత్వం | నంద కిషోర్ |
రచన | అరుణ్ బాలాజీ |
నిర్మాత | డి. ప్రతాప్‌రాజు (తెలుగు) |
తారాగణం | ధృవ సర్జా రష్మికా మందన్న |
ఛాయాగ్రహణం | విజయ్ మిల్టన్ |
కూర్పు | మహేష్ ఎస్ |
సంగీతం | పాటలు: చందన్‌శెట్టి బ్యాక్ గ్రౌండ్ సంగీతం: వి. హరికృష్ణ |
నిర్మాణ సంస్థ | సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (తెలుగు) |
విడుదల తేదీ | ఫిబ్రవరి 19, 2021 |
సినిమా నిడివి | 160 నిమిషాలు |
దేశం | ![]() |
భాషలు | కన్నడ తెలుగు |
బడ్జెట్ | 25 కోట్లు[1][2] |
పొగరు 2021లో కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. తెలుగులో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డి. ప్రతాప్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు ధృవ సర్జా, రష్మికా మందన్న హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 19న విడుదలైంది.[3] ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 2 విడుదలైంది.[4]
శివ (ధృవ్ సార్జా) కు సరిగ్గా ఊహ తెలియక ముందే తండ్రిని కోల్పోయి, తల్లి (పవిత్రా లోకేష్) రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతాడు. అతడు నివసించే కాలనీలో ఉండే పూజారి కూతురు టీచర్ (రష్మిక)తో ప్రేమలో పడతాడు. ఆమె వల్ల ఇతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. అతను తన తల్లికి ఆవిడ కుటుంబానికి దగ్గరయ్యాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)