పొన్ రాధాకృష్ణన్ | |||
![]()
| |||
ఆర్ధిక శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | అర్జున్ రామ్ మేఘవాల్ | ||
తరువాత | అనురాగ్ సింగ్ ఠాకూర్ | ||
కేంద్ర రహదార్లు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
తరువాత | వీ.కే.సింగ్ | ||
పదవీ కాలం 8 సెప్టెంబర్ 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | శ్రీపాద యశోనాయక్ | ||
తరువాత | కే. హెచ్. మునియప్ప | ||
షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కృష్ణన్ పాల్ గుర్జార్ | ||
తరువాత | మన్‌సుఖ్ మాండవీయ | ||
పదవీ కాలం 5 జూన్ 2014 – 18 జూన్ 2019 | |||
ముందు | జె. హెలెన్ డేవిడ్సన్ | ||
తరువాత | హెచ్. వసంత్ కుమార్ | ||
Member of Parliament
for నాగర్‌కోయిల్ లోక్‌సభ సభ్యుడు | |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | ఎన్. డెన్నిస్ | ||
తరువాత | ఏ. వీ. బెల్లర్మిన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగర్‌కోయిల్, తమిళనాడు, భారతదేశం | 1 మార్చి 1952||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పొన్నయ్య అయ్యప్పన్, తంగాకాని | ||
నివాసం | నాగర్‌కోయిల్, కన్యాకుమారి జిల్లా , తమిళనాడు, భారతదేశం | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయ నాయకుడు |
పొన్ రాధాకృష్ణన్ (జననం 1952 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]
పొన్ రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లా, అలంతంగరై గ్రామంలో 1952 మార్చి 1న పొన్నయ అయ్యప్పన్, తంగకాని దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు.
పొన్ రాధాకృష్ణన్ 1981లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరి ఆ తరువాత కార్యదర్శి నియమితుడయ్యాడు. ఆయన 1991 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రాధాకృష్ణన్ 1999 లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత పట్టణాభివృద్ధి & పేదరిక నిర్మూలన శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశాడు.
పొన్ రాధాకృష్ణన్ 2004, 2009, 2019, 2021 (ఉప ఎన్నిక) పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికలలో కన్యాకుమారి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో భారీ పరిశ్రమలు, షిప్పింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]
సంవత్సరం | ఎన్నికల | పార్టీ | నియోజకవర్గం పేరు | ఫలితం | ఓట్లు | ఓటు % |
---|---|---|---|---|---|---|
1991 | 10వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | నాగర్‌కోయిల్ | 3వ స్థానం | 1,02,029 | 18.82% |
1996 | 11వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | నాగర్‌కోయిల్ | 2వ స్థానం | 1,69,885 | 30.25% |
1998 | 12వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | నాగర్‌కోయిల్ | 2వ స్థానం | 2,67,426 | 45.08% |
1999 | 13వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | నాగర్‌కోయిల్ | విజేత | 3,07,319 | 50.21% |
2004 | 14వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | నాగర్‌కోయిల్ | 2వ స్థానం | 2,45,797 | 36.49% |
2009 | 15వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కన్యాకుమారి | 2వ స్థానం | 2,54,474 | 33.20 % |
2014 | 16వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కన్యాకుమారి | విజేత | 3,72,906 | 37.62 % |
2019 | 17వ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | కన్యాకుమారి | 2వ స్థానం | 3,67,302 | 35.04 % |
2021 | ఉప ఎన్నిక 2021 | భారతీయ జనతా పార్టీ | కన్యాకుమారి | 2వ స్థానం | 438,087 | 39.92% |