పొన్మగల్ వందాళ్ | |
---|---|
దర్శకత్వం | జె.జె. ఫ్రెడ్‌రిక్ |
రచన | జె.జె. ఫ్రెడ్‌రిక్ |
నిర్మాత | సూర్య , జ్యోతిక |
తారాగణం | జ్యోతిక పార్తీబన్ భాగ్యరాజా త్యాగరాజన్ ప్రతాప్ పోతన్ |
ఛాయాగ్రహణం | రామ్జీ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 29 మే 2020 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
పొన్మగల్ వందాళ్ 2020 లో విడుదలైన తమిళ సినిమా. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు జె.జె. ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజా, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ లో విడుదల కాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 29 మే 2020న విడుదలైంది.
ఊటీలో పదిహేను సంవత్సరాల క్రితం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైకో జ్యోతి కేసును న్యాయవాది వెన్బ (జ్యోతిక), పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. లాయర్ వెన్బా ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చింది? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలు బయటపడ్డాయా? లేదా? అనేదే సినిమా కథ.[1]