పోచర్ | |
---|---|
జానర్ | క్రైమ్ డ్రామా |
సృష్టికర్త | రిచీ మెహతా |
రచయిత |
|
దర్శకత్వం | రిచీ మెహతా |
తారాగణం | |
దేశం | భారతదేశం |
అసలు భాష | మలయాళం |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers |
|
ఛాయాగ్రహణం | జోహన్ హ్యూర్లిన్ ఎయిడ్ట్ |
ఎడిటర్లు |
|
ప్రొడక్షన్ కంపెనీలు |
|
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
వాస్తవ విడుదల | 23 ఫిబ్రవరి 2024 |
పోచర్ 2024లో మలయాళం భాషలో విడుదలైన క్రైమ్ డ్రామా టెలివిజన్ మినిసిరీస్. 2015లో కేరళ అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ శిఖర్’ ఆధారంగా ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, క్యూ.సి ఎంటర్‌టైన్‌మెంట్, సూట్ఏబుల్ పిక్చర్స్, పూర్ మ్యాన్స్ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆలియా భట్[1], ప్రేరణ సింగ్, ఎడ్వర్డ్ హెచ్. హామ్ జూనియర్, రేమండ్ మాన్స్ఫీల్డ్ నిర్మించిన ఈ సిరీస్‌కు రిచీ మెహతా దర్శకత్వం వహించాడు.
నిమిషా సజయన్, రోషన్ మాధ్యూ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న విడుదల చేసి[2], సిరీస్‌ను 2024 ఫిబ్రవరి 23న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.
ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి అధికారి కూడా సాయం చేస్తుంటాడు. జరుగుతున్న దారుణాలు చూడలేక అప్రూవర్‌గా మారతాడు. స్మగ్లర్ రాజ్ (నూరుద్దీన్) ఆధ్వర్యంలోనే ఏనుగుల వేట కొనసాగుతుందని ఆ అధికారి పై అధికారులకు చెబుతాడు. దీంతో డిపార్ట్‌మెంట్ మొత్తం అలర్ట్ అవుతుంది. స్మగ్లర్లను పట్టుకోవడానికి రేంజ్ ఆఫీసర్ మాలా జోగి (నిమిషా సజయన్) నేతృత్వంలో ఒక బృందం రంగంలోకి దిగుతుంది. అలాన్ (రోషన్ మాథ్యూ)తోపాటు మరికొందరితో కలిసి రాజ్‌ను పట్టుకోవడానికి అడవి అంతా గాలిస్తుంటుంది. ఈ ఆపరేషన్‌లో మాల ఏనుగుల వేటగాళ్లను పట్టుకుందా? ఈ క్రమంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[3]