పోలీస్ స్టోరీ 2 | |
---|---|
![]() | |
దర్శకత్వం | థ్రిల్లర్ మంజు |
స్క్రీన్ ప్లే | థ్రిల్లర్ మంజు |
కథ | ఎస్.ఎస్.డేవిడ్ |
నిర్మాత | జి.హెచ్.గురుమూర్తి ఎన్.నరసింహమూర్తి |
తారాగణం | సాయి కుమార్ పి. జె. శర్మ శోభరాజ్ రాక్‌లైన్ వెంకటేష్ |
ఛాయాగ్రహణం | జె.జి.కృష్ణ |
కూర్పు | ఆర్.జనార్ధన్ |
సంగీతం | ఆర్.పి.పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | గురురాయ ఫిల్మ్ మేకర్స్ |
విడుదల తేదీ | 6 ఫిబ్రవరి 2007 |
సినిమా నిడివి | 166 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పోలీస్ స్టోరీ 2 అనేది థ్రిల్లర్ మంజు కథ, దర్శకత్వం లో విడుదలైన 2007 భారతీయ కన్నడ భాషా యాక్షన్ చిత్రం. ఇది 1996 చిత్రం పోలీస్ స్టోరీకి కొనసాగింపు. ఇందులో అగ్ని ఐపిఎస్ పాత్రలో సాయి కుమార్ నటించాడు. ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోకి ఏకకాలంలో డబ్బింగ్ చేయబడింది. సాయికుమార్ సోదరుడు పి. రవిశంకర్ తెలుగు వెర్షన్లో శోభరాజ్ కోసం డబ్బింగ్ చెప్పాడు.
అగ్ని , విజయ్ ఇద్దరూ అంకితభావమున్న పోలీసులు. నేరరహిత నగరాన్ని సాధించాలనే అనే వారి లక్ష్యంలో గాడ్ మదర్ కెంపమ్మ నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు. న్యాయవ్యవస్థనూ, రాజకీయాలనూ శాసించగలిగిన కెంపమ్మ, కాల్ సెంటర్ అమ్మాయి శ్వేతను హత్య చేసిన తన కొడుకును అగ్ని, విజయ్‌లు కాల్చి చంపినప్పుడు తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంటుంది. పోలీసు శాఖకు చెడ్డ పేరు తీసుకురావడానికి, కెంపమ్మ ఇద్దరు అండర్వరల్డ్ డాన్ లను ప్రధాన పదవులు ఇస్తానని వాగ్దానం చేసి వారిని ఏకం చేస్తుంది. పోలీసు శాఖలోని తన సహచరులు కెంపమ్మకు అనుకూలంగా మారినప్పటికీ అగ్ని ధైర్యం కోల్పోడు. అతనికి నిజాయితీగల ముఖ్యమంత్రి మద్దతు ఉంది. కెంపమ్మకు సమాధానం ఇచ్చే సామాజిక వ్యతిరేక శక్తులను చంపడంలో అగ్ని ఒక పీడకలగా మారాడు. ఈ సమయంలో రాజకీయాలలో మార్పులు జరిగి అధికార స్థానాలు తారుమారవుతాయి. కెంపమ్మ కుడి భుజం ధర్మరాజ్ ముఖ్యమంత్రి అవుతాడు. అగ్ని తన తెలివిని ఉపయోగించి, భద్రతా కారణాల దృష్ట్యా ధర్మరాజ్ నివాసంలోని ఇద్దరు డాన్ లలో ఒకరిని చంపుతాడు. అగ్ని కదలికల గురించి ధర్మరాజ్ గందరగోళానికి గురవుతాడు. ఇంతలో, బ్లాక్ టైగర్ ప్రత్యక్షమైనందుకు అగ్ని ఆశ్చర్యపోతాడు. బ్లాక్ టైగర్ వాస్తవానికి మరణశిక్ష నుండి అవినీతి అధికారుల సహాయంతో తప్పించుకుంటాడు (ఇది మునుపటి చిత్రం లో చూపబడింది). అగ్ని ఈ కేసును దర్యాప్తు చేయడానికి నియమించబడ్డాడు. అతడు ఈ కేసులో ముగ్గురు ప్రభుత్వ అధికారులు పరస్పరం సంబంధం కలిగి ఉన్నారని తెలుసుకుని, వారిని కోర్టులో హాజరుపరచడానికి సురక్షితమైన ప్రదేశానికి తీసుకువస్తాడు. కాని వారు ఒక ఎన్కౌంటర్‌లో బ్లాక్ టైగర్ చేత చంపబడతారు. అగ్ని కూడా ఈ దశలో తన నమ్మకమైన సహోద్యోగి విజయ్‌ను కోల్పోయి ఒంటరివాడవుతాడు. ఇంతలో, బ్లాక్ టైగర్ వివిధ ప్రదేశాలలో బాంబులు వేసి హాంకాంగ్ పారిపోతాడు. ఒక బాంబు పేలుడులో అగ్ని తన తల్లిని కోల్పోతాడు. ఆగ్రహంతో అగ్ని కెంపమ్మ నివాసంలోకి చొరబడి ఆమెను చంపుతాడు, అక్కడ అతను ధర్మరాజ్ను కోర్టులో ప్రతిదీ బహిర్గతం చేయమని బలవంతం చేస్తాడు. అగ్ని బ్లాక్ టైగర్ను ఎదుర్కోవడానికి అనుమతి పొంది, హాంకాంగ్‌కు వెళ్తాడు. అక్కడ అతను బ్లాక్ టైగర్ ను మట్టుపెడతాడు.
1996లో వచ్చిన పోలీస్ స్టోరీ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణులు చాలా వరకు మొదటి సినిమాలోని వారే.[1]
సిఫీ.కామ్ ఇలా సమీక్షించింది." ఇది పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎక్స్ట్రావాంజా. 10 సంవత్సరాల క్రితం విడుదలైన 'పోలీస్ స్టోరీ' కి సీక్వెల్ ఈ చిత్రం సాంకేతిక పరిజ్ఞానంలో నవీకరించబడింది. స్టైలిష్‌గా రూపొందించబడింది. అగ్ని పాత్రలో సంభాషణల రారాజు సాయికుమార్ నుండి ఎనిమిది యాక్షన్ సన్నివేశాలూ, థ్రిల్లర్ మంజు నాన్ స్టాప్ పంచ్ సంభాషణలూ ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటాయి. ఇది యాక్షన్ ప్రేమికులకూ సంభాషణ ఆధారిత చిత్రాలను ఇష్టపడేవారికీ విందు.[2][3]