ప్రకాష్ కోవెలమూడి | |
---|---|
జననం | 25 జూన్, 1975 |
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - ప్రస్తుతం |
బంధువులు | కోవెలమూడి సూర్యప్రకాశరావు (తాత) కె. రాఘవేంద్రరావు (తండ్రి) శోభు యార్లగడ్డ (బావ) |
ప్రకాష్ కోవెలమూడి, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. 2004లో మార్నింగ్ రాగా సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో బొమ్మలాట అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా 53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది.[1] 2011లో అనగనగా ఓ ధీరుడు అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో జడ్జిమెంటల్ హై క్యా అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు.[2][3]
తెలుగు సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు, కోవెలమూడి సూర్యప్రకాశరావు మనవడైన ప్రకాష్ 1975, జూన్ 25న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్నాడు.[4]
2002లో తెలుగులో వచ్చిన నీతో సినిమాలో తొలిసారిగా నటించిన ప్రకాష్,[5] ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు, కాని ఆ సినిమా నిలిపివేయబడింది.[6] మార్నింగ్ రాగా సినిమాలో నటించాడు. 2004లో బొమ్మలాట, 2011లో అనగనగా ఓ ధీరుడు, సినిమాలు తీశాడు.[7][8]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2002 | నీతో | మాధవ్ | |
2004 | మార్నింగ్ రాగా | అభినయ్ | ఇంగ్లీష్ చిత్రం |
సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2004 | బొమ్మలాట | తెలుగు పిల్లల చిత్రం |
2011 | అనగనగా ఓ ధీరుడు | |
2015 | సైజ్ జీరో | |
2015 | ఇంజి ఇడుప్పజగి | తమిళ చిత్రం |
2019 | జడ్జిమెంటల్ హై క్యా | హిందీ చిత్రం |
{{cite web}}
: CS1 maint: url-status (link)