ప్రజాకూటమి,[1] 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ జన సమితి మధ్య ఏర్పడిన ఎన్నికల కూటమి. ఆ సంవత్సరం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఇది 2018 సెప్టెంబరు 11 న ఏర్పడింది. [2] ఎన్నికల ప్రచారంలో పార్టీ ప్రధాన పోటీదారుగా కనిపించింది, [3] అయితే ఎన్నికలలో, తెరాస ఈ కూటమిని చిత్తుగా ఓడించి, అఖండ విజయం సాధించింది. [4] 2019 జనవరి 23 న ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ రెండింటిలోనూ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో కూటమి రద్దైంది.[5] అప్పటి వరకు, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేయడంపై అక్కడఖ్ఖడా చర్చ జరుగుతూండేది.[6]
ఉమ్మడి శత్రువును ఓడించేందుకు ఒకప్పుడు బద్ధ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, తెదేపాలు కలిసి జట్టుకట్టడం ఇదే తొలిసారి. [1] [2] అందుకే తెరాస, భాజపాలు దీన్ని ‘అపవిత్ర కూటమి’ అని విమర్శించారు. [7]
ప్రజాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో 2018 నవంబరు 26 న విడుదలైంది [8] [9]
వ్యవసాయం
విద్యుత్
ఉపాధి
పెన్షన్
నం. | పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | సీట్లలో పోటీ చేశారు | సీట్లు గెలుచుకున్నారు |
---|---|---|---|---|---|---|
1. | భారత జాతీయ కాంగ్రెస్ | ![]() |
![]() |
ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి | 94 | 19 |
2. | తెలుగుదేశం పార్టీ | ![]() |
![]() |
ఎల్. రమణ | 14 | 2 |
3. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ![]() |
![]() |
చాడ వెంకట్ రెడ్డి | 3 | 0 |
4. | తెలంగాణ జన సమితి | ![]() |
![]() |
ఎం. కోదండరాం | 8 | 0 |
మొత్తం | 119 | 21 |
On September 11, when once arch-rivals Congress and Telugu Desam Party (TDP) formed a grand alliance (Mahakutami or Prajakutami) in a bid to defeat the ruling Telangana Rashtra Samithi (TRS) in poll-bound Telangana, there were several questions about its future.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)