![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ప్రజ్ఞాన్ ఓజా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | భువనేశ్వర్, ఒడిశా | 1986 సెప్టెంబరు 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.83 మీ. (6 అ. 0 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 261) | 2009 నవంబరు 24 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2013 నవంబరు 14 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 174) | 2008 జూన్ 28 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2012 జూలై 24 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 29) | 2009 జూన్ 6 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 జూన్ 13 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05–2015/16 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2011 | దక్కన్ చార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2015 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | సర్రీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–2016/17 | బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | బీహార్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 ఫిబ్రవరి 21 |
ప్రజ్ఞాన్ ఓజా (జననం 1986 సెప్టెంబరు 5) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్. అతను ఎటాకింగ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలరుగా, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా హైదరాబాదు జట్టులో ఆడాడు. టెస్టు క్రికెట్‌లో చేసిన పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [1]
ఓజా 2004/05లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అండర్-19 స్థాయిలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2006-07 రంజీ ట్రోఫీ సీజన్‌లో 6 గేమ్‌లలో 19.89 సగటుతో 29 వికెట్లు సాధించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ బంతిని ఫ్లైటు చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు.
10 సంవత్సరాల వయస్సులో, చంద్రశేఖర్‌పూర్‌లోని DAV పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు, ససంగ్ S దాస్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లోని వేసవి శిక్షణ కోసం సాహిద్ స్పోర్టింగ్ క్లబ్‌కు వెళ్లాడు. మూడు సంవత్సరాల తర్వాత, అతను హైదరాబాద్‌కు వెళ్లి, సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలోని భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయంలో చేరాడు. కోచ్ టి. విజయ్ పాల్ మార్గదర్శకత్వంలో క్రికెట్‌ను తన వృత్తిగా ఎంచుకున్నాడు.
ఓజా 2004 నుండి 2015 వరకు దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహించాడు, ఆపై రెండు సీజన్లలో (2015/16-2016/17) అతిథి ఆటగాడిగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తరపున ఆడాడు. అతను గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. దేశీయ క్రికెట్ లోను, IPLలో మొదటి రెండు సీజన్లలోనూ అతను సాధించిన విజయాల కారణంగా 2008లో బంగ్లాదేశ్ టూర్, ఆసియా కప్ కోసం ఎంపికైన భారత జట్టులో అతనికి స్థానం లభించింది.
అతను 2008 జూన్ 28 న కరాచీలో బంగ్లాదేశ్‌తో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి, 2/43 సాధించాడు.
2009 నవంబరు 24 న, కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అమిత్ మిశ్రా స్థానంలో ఓజా తన తొలి టెస్టు ఆడాడు. 23 ఓవర్లలో 2/37, 15.3 ఓవర్లలో 2/36తో భారత్ 100వ టెస్టు విజయం సాధించడంలో పాత్ర వహించాడు. ఆ తర్వాత మూడవ టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, భారతదేశం కోసం ఇన్నింగ్స్ విజయం సాధించాడు. ఆ రెండు టెస్టుల్లో 28.66 సగటుతో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ 800వ, చివరి, వికెట్ ఓజాయే.
2009 జూన్ 6 న బంగ్లాదేశ్‌తో జరిగిన తన తొలి T20 లో ఓజా, నాలుగు ఓవర్లలో 4/21 తీసుకున్నాడు. ఆ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు గాను అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతని తొలి వికెట్ అతను తీసిన తొలి T20 వికెట్ కూడా.
అతను IPL లో ఆరు ఎడిషన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసాడు. అతని కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, సచిన్ టెండూల్కర్ ల ప్రశంసలు పొందాడు. రెండవ సీజన్‌లో బాగా విజయవంతమయ్యాడు. దాంతో ఇంగ్లాండ్‌లో జరిగిన 2009 ICC వరల్డ్ ట్వంటీ20లో అతని స్థానం నిర్ధారితమైంది. IPL 3 టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసినందుకు అతనికి పర్పుల్ క్యాప్ లభించింది. ఓజా, 3 సార్లు IPL విజేత జట్లలోను (డెక్కన్ ఛార్జర్స్‌కు ఒకసారి, ముంబై ఇండియన్స్‌కు 2 సార్లు), ఒకసారి ముంబై ఇండియన్స్ తరఫున ఛాంపియన్స్ లీగ్‌లోనూ భాగంగా ఉన్నాడు.
ఓజా 2011 సీజన్ చివరి కొన్ని వారాల పాటు సర్రే తరపున ఆడేందుకు 2011 ఆగస్టులో సంతకం చేశాడు. 4 గేమ్‌లలో అతను సాధించిన 24 వికెట్ల సాయంతో సర్రే LV కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డివిజన్ వన్‌కు ప్రమోషను పొందింది.
నవంబరులో, వెస్టిండీస్ పర్యటనలో మొదటి టెస్టులో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి పునరాగమనం చేశాడు.
2014 డిసెంబరులో ఓజా బౌలింగు యాక్షను చట్టవిరుద్ధమని తేలడంతో పోటీ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అతన్ని నిషేధించారు.[2][3] తర్వాత 2015 జనవరి 30 న జరిపిన పరీక్షలలో ఓజా నెగ్గడంతో, బౌలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి అనుమతించారు.
2008 ఇంటర్వ్యూలో, ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన వెంకటపతి రాజు తనను భారతదేశం తరపున ఆడటానికి ప్రేరేపించాడని ఓజా చెప్పాడు. [4]
2018-19 రంజీ ట్రోఫీకి ముందు, అతను హైదరాబాద్ నుండి బీహార్‌కు బదిలీ అయ్యాడు. [5]
2020 ఫిబ్రవరి 21 న అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరయ్యాడు. [6] [7] ఓజా 2008 నుండి 2013 వరకు 24 టెస్టులు, 18 ODIలు, 6 T20Iలు -48 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మ్యాచ్ అయిన 2013లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో భారతదేశం తరఫున తాను ఆడీన చివరి ఆటలో, అతను 89 పరుగులకు 10 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [8]
ప్రజ్ఞాన్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో జన్మించాడు. అతను 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌కు వెళ్లి, అప్పటి నుండి అతను తన కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు -మహేశ్వర్ ఓజా (రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ అధికారి), బిదులతా ఓజా.[9] 2010 మే 16 న అతను ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న కరాబీ బరాల్‌ను పెళ్ళి చేసుకున్నాడు. [10]