ప్రణతి | |
---|---|
జననం | [1] | 19 ఏప్రిల్ 1987
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2001–2005 |
జీవిత భాగస్వామి |
డా. శివరాజన్ (m. 2011) |
తల్లిదండ్రులు |
|
ప్రణతి ఒక భారతీయ మాజీ మోడల్, సినిమా నటి. ఆమె పలు మలయాళ భాషా చిత్రాలలో నటించింది. అయితే, తమిళ చిత్రం గాంబీరం (2004)లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె మలయాళం, తమిళం భాషలతో పాటు కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలోనూ నటించింది.[2]
ప్రణతి 1987 ఏప్రిల్ 19న మలయాళ నటుడు జోస్, రత్నప్రభ దంపతులకు జన్మించింది. ఆమె సెప్టెంబరు 2011లో డా.శివరాజన్ ను వివాహం చేసుకుంది.
ప్రణతి మోడల్ గా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె 2001లో జరిగిన మిస్ సౌత్ ఇండియా అందాల పోటీలో మిస్ బ్యూటిఫుల్ హెయిర్ అండ్ మిస్ బెస్ట్ ఆఫ్ కొచ్చి టైటిల్స్ గెలుచుకుంది. ఊటీలో రెసిడెన్షియల్ స్కూల్ అయిన సెయింట్ జార్జ్ హోమ్స్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.[3]
జయరాజ్ విజయవంతమైన మలయాళ చిత్రం 4 ది పీపుల్ (2004)లో భరత్ తో కలిసి ప్రణతి తన నటనా రంగ ప్రవేశం చేసింది. 2005లో, నటుడు జై ఆకాశ్ తో కలిసి గురుదేవ, కత్రు ఉల్లవరాయ్ చిత్రాలు చేసింది.[4] 2005లో, ఆమె సంతోషా అనే కన్నడ చిత్రంతో పాటు సత్యరాజ్ నటించిన వణక్కం తలైవాలో నటించింది.[5] అయితే, ఆ తరువాత అనూహ్యంగా తన కెరీర్ కు బ్రేక్ పడింది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
2004 | 4 ది పీపుల్ | టీనా | మలయాళం | తెలుగులో యువసేన |
2004 | గాంబీరం | సరోజా | తమిళ భాష | |
2005 | గురుదేవ | దేవా | తమిళ భాష | |
2005 | గురు | తెలుగు | ||
2005 | సంతోషా | రామయ్యా | కన్నడ | |
2005 | కత్రు ఉల్లవరాయ్ | నర్మదా | తమిళ భాష | |
2005 | వనక్కం తలైవా | రామయ్యా | తమిళ భాష | |
2006 | సరదా సరదాగా | సిరి/మాయా | తెలుగు |