ప్రణీత్ కౌర్ లోక్‌సభ సభ్యురాలు | |||
![]()
| |||
లోక్‌సభ సభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 May 2019 | |||
ముందు | ధరమ్వీర్ గాంధీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పాటియాలా | ||
పదవీ కాలం 10 అక్టోబర్ 1999 – 18 మే 2014 | |||
ముందు | ప్రేమ్ సింగ్ చందుమజ్రా | ||
తరువాత | ధరమ్వీర్ గాంధీ | ||
నియోజకవర్గం | పాటియాలా | ||
విదేశాంగ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 28 మే 2009 – అక్టోబర్ 2012[1] | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | ఆనంద్ శర్మ | ||
తరువాత | వీ.కే.సింగ్ | ||
శాసనసభ సభ్యురాలు
| |||
పదవీ కాలం ఆగస్టు 2014 – మార్చి 2017 | |||
ముందు | అమరీందర్ సింగ్ | ||
తరువాత | అమరీందర్ సింగ్ | ||
నియోజకవర్గం | పాటియాలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సిమ్లా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | 3 అక్టోబరు 1944||
రాజకీయ పార్టీ | స్వతంత్ర (ఫిబ్రవరి 2023 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (ఫిబ్రవరి 2023 వరకు) | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | జై ఇందర్ కౌర్, రణిందర్ సింగ్ |
ప్రణీత్ కౌర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె ఒక్కసారి ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది.
ప్రణీత్ కౌర్ తన భర్త అమరీందర్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1999, 2004, 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 మే నుంచి 2014 మే వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. ఆమె 2014లో పాటియాలా లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయి 2019లో గెలిచింది.
ప్రణీత్ కౌర్ బీజేపీకి అనుకూలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2023 ఫిబ్రవరి 3న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.[2][3]