ప్రతాప్ సి. రెడ్డి

ప్రతాప్ సి. రెడ్డి
ప్రతాప్ సి. రెడ్డి (మార్చి 2014)
జననం
ప్రతాప్ చంద్రారెడ్డి

(1933-02-05) 1933 ఫిబ్రవరి 5 (వయసు 91)
విద్యాసంస్థ
వృత్తి
  • వ్యాపారవేత్త
జీవిత భాగస్వామిసుచరిత రెడ్డి
బంధువులు
పురస్కారాలుపద్మ విభూషణ్ (2010)
పద్మ భూషణ్ (1991)

ప్రతాప్ చంద్రారెడ్డి (జననం: 1933 ఫిబ్రవరి 5) చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలం, ఆరగొండలో పుట్టాడు.[1] [2] అతను హృద్రోగ నిపుణుడు. భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రుల శ్రేణి అయిన అపోలో హాస్పిటల్స్ ను స్థాపించాడు. ఆ తరువాత అపోలో ఫార్మసీ సంస్థను స్థాపించాడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం పొందిన వ్యక్తి. 2017లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తిమంతులైన వ్యక్తుల్లో అతనికి 48వ స్థానం ఇచ్చింది.[3] ఎయిర్సెల్ లో 26 శాతం వాటా ఇతనిదే.

ప్రతాప రెడ్డికి నలుగురు కుమార్తెలు. ఈ నలుగురూ అపోలో హస్పిటల్స్ లో డైరెక్టర్లుగా ఉన్నారు.[4] 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, [5]2010లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది.[6]

నేపథ్యం

[మార్చు]

రెడ్డికి 1991లో పద్మ భూషణ్ లభించింది. [5]2010లో భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ [6] కూడా అందుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. The first 'Apollo Isha Vidya Rural School' at Aragonda! Archived 2015-04-09 at the Wayback Machine, Apollo Hospitals press release, 25 December 2012, retrieved 2015-04-03
  2. "The Trailblazer". Express Healthcare. January 2009. Retrieved 2015-04-04.
  3. "India's 50 powerful people". India Today. 14 April 2017.
  4. Hussain, Shabana (24 November 2014). "Apollo Hospitals' Prathap Reddy grooms daughters for leadership positions". Forbes India. Retrieved 16 November 2016.
  5. 5.0 5.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-10-15. Retrieved 2014-11-15.
  6. 6.0 6.1 "This Year's Padma Awards announced", Pib Nic, Jan 25, 2010, 25 January 2010