ప్రతాప్ సింగ్ బజ్వా (జననం 29 జనవరి 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై బియాంత్ సింగ్, రాజిందర్ కౌర్ భతల్, అమరీందర్ సింగ్ హయాంలో మంత్రిగా పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ప్రతాప్ సింగ్ బజ్వా చండీగఢ్‌లోని డిఎవి కళాశాల నుండి 1976లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలో వచ్చి , 1980లో జిల్లా యూత్ కాంగ్రెస్ గురుదాస్‌పూర్ అధ్యక్షుడిగా, 1980లో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 1982లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పార్టీ పదవులలో పని చేశాడు.
ప్రతాప్ సింగ్ బజ్వా 1992, 2002 & 2007లో కహ్నువాన్ నియోజకవర్గం నుండి పంజాబ్ శాసనసభకు ఎన్నికై 1994 నుండి 1995 వరకు రాష్ట్ర సమాచార & ప్రజా సంబంధాల మంత్రిగా, 1995 నుండి 1996 వరకు న్యాయవ్యవస్థ, జైళ్లు, శాఖ మంత్రిగా, 1996 నుండి 1997 వరకు & 2002 నుండి 2007 వరకు పాఠశాల విద్య శాఖ మంత్రిగా పని చేసి 2022లో ఖాదియన్ నియోజకవర్గం నుండి ఎన్నికై,[2]పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించబడ్డాడు.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)