ప్రతినిధి | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ మండవ |
రచన | ఆనంద్ రవి |
నిర్మాత | సాంబశివరావు |
తారాగణం | నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు |
ఛాయాగ్రహణం | చిట్టిబాబు |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | సుధా సినిమాస్ |
పంపిణీదార్లు | దిల్ రాజు |
విడుదల తేదీ | 25 ఏప్రిల్ 2014 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, హిందీ |
బడ్జెట్ | 2 కోట్లు |
ప్రతినిధి 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.[1] 2013, జూన్ 23న ఈ చిత్రం ప్రారంభమయింది.[2] ఏక్ లీడర్ పేరుతో హిందీలోకి అనువాదమయింది,[3] కో2 పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది.
‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్) ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.[4]
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. 19 నిముషాల 28 సెకన్లు నిడివి ఉన్న ఈ పాటలు 2013, నవంబర్ 13న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఆదిత్యా మ్యాజిక్ ద్వారా విడుదల అయ్యాయి.[5][6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వందేమాతరం" | బి. సుబ్బరాయశర్మ, అఖిలేష్ రెడ్డి | ధనుంజయ్ | 3:36 |
2. | "మా మాట" | బి. సుబ్బరాయశర్మ | ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్ | 4:16 |
3. | "చూపుల్లో పరవశం" | బాలాజీ | రాహుల్ నంబియార్ | 3:42 |
4. | "నీ తెగువకీ" | బి. సుబ్బరాయశర్మ | రంజిత్ | 4:07 |
5. | "వైష్ణవ జనతో" | నరసింహ మెహతా | బేబి తిల్లు, సిద్ధార్థ్ | 2:35 |
6. | "ప్రతినిధి, (డైలాగ్)" | నారా రోహిత్ | 0:37 | |
7. | "ప్రతినిధి, (డైలాగ్)" | నారా రోహిత్ | 0:35 | |
మొత్తం నిడివి: | 19:28 |