ప్రతిభా సింగ్ | |||
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 ఏప్రిల్ 26 | |||
ముందు | కుల్దీప్ సింగ్ | ||
---|---|---|---|
పార్లమెంట్ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 నవంబర్ 2 | |||
ముందు | రామ్ స్వరూప్ శర్మ | ||
నియోజకవర్గం | మండి లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1956 జూన్ 16 జంగా హిమాచల్ ప్రదేశ్ భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | వీరభద్ర సింగ్ | ||
సంతానం | విక్రమాదిత్య సింగ్ |
ప్రతిభా సింగ్ (జననం: 1956 జూన్ 16) హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్త భారత పార్లమెంటు సభ్యురాలు .
ప్రతిభా సింగ్ భర్త వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గానికి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు. [1]
ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ 1985లో అప్పటి హిమాచల్ ప్రదేశ్ దేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరభద్ర సింగ్ కు ప్రతిభా సింగ్ రెండవ భార్య. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్ దంపతుల కుమారుడు, విక్రమాదిత్య సింగ్, సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేస్తున్నాడు.
2004 భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రతిభాసింగ్ తొలిసారి ప్రత్యర్థి మహేశ్వర్ సింగ్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 2013 (ఉప ఎన్నిక) ఎన్నికలలో, ఆమె మళ్లీ అదే స్థానం నుండి అలాగే 2021లో ఎన్నికయ్యారు.
సంవత్సరం | వివరణ |
---|---|
2004 - 2009 |
|
2013 - 2014 | 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. |
2021 - 2024 |
|