ప్రమోద్య విక్రమసింఘే

ప్రమోద్య విక్రమసింఘే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విక్రమసింఘే గల్లాగే ప్రమోద్య
పుట్టిన తేదీAugust 14, 1971 (1971-08-14) (age 53)
మాతర, సిలోన్
మారుపేరువిక్కీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 51)1991 డిసెంబరు 12 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2001 జనవరి 20 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 64)1990 డిసెంబరు 31 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2002 జూలై 7 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 40 134
చేసిన పరుగులు 555 344
బ్యాటింగు సగటు 9.40 8.59
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 51 32
వేసిన బంతులు 7,260 5,720
వికెట్లు 85 109
బౌలింగు సగటు 41.87 39.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/60 4/48
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 26/–
మూలం: ESPNcricinfo, 2017 ఫిబ్రవరి 9

విక్రమసింఘే గల్లాగే ప్రమోద్య (జననం 1971, ఆగస్టు 14) శ్రీలంక మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 1990లలో వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[2] 1996 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[3] శ్రీలంక పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు ప్రస్తుత జాతీయ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు.[4]

దేశీయ క్రికెట్

[మార్చు]

క్లబ్ క్రికెట్ పోటీల్లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆడాడు.[5] 1988లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌కు ఆడుతూ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. యూత్ ఆసియా కప్ ఛాంపియన్‌షిప్ తర్వాత 1989లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. 1991లో శ్రీలంక బి జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు.[6] అదే సంవత్సరం నవంబరులో కొలంబోలోని కలుతర ఫిజికల్ కల్చర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులకు 10 వికెట్లతో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన శ్రీలంక దేశీయ క్రికెట్‌లో మొదటి బౌలర్‌గా నిలిచాడు.[7][8]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

1990–91 ఆసియా కప్‌లో 1990 డిసెంబరు 31న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ తో తన వన్డే క్రికెట్ కు అరంగేట్రం చేశాడు.[9] 1991 డిసెంబరు 12న పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[10] 1995-96లో పాకిస్తాన్ పర్యటనలో శ్రీలంక మొట్టమొదటి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.[11] ఈ సిరీస్‌లో అతను ఎనిమిది వికెట్లు తీశాడు. శ్రీలంక పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌పై వారి మొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.[12]

1992, 1996, 1999 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. 1996 ప్రపంచ కప్ క్యాంపెయిన్‌లో క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌తో సహా నాలుగు మ్యాచ్‌లలో పాల్గొన్నాడు, అక్కడ శ్రీలంక మొదటిసారి ట్రోఫీని గెలుచుకుంది.[13] 1998 లో శ్రీలంక సెమీఫైనల్‌కు చేరిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ ఎడిషన్‌లో అతను శ్రీలంక జట్టులో కూడా సభ్యుడు. 1999 లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆండీ ఫ్లవర్‌ను ఔట్ చేయడం ద్వారా తన 100వ వన్డే వికెట్‌ని సాధించాడు.

చీఫ్ సెలెక్టర్

[మార్చు]

శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు. తర్వాత 2004లో అశాంత డి మెల్ నేతృత్వంలోని శ్రీలంక జాతీయ సెలక్షన్ కమిటీలో చేరాడు.[14][15][16] సనత్ జయసూర్య నేతృత్వంలో కొత్తగా నియమించబడిన సెలెక్షన్ ప్యానెల్‌లో కూడా అతను చేర్చబడ్డాడు. 2020 డిసెంబరులో అశాంత డి మెల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ఎంపిక ప్యానెల్‌లో కూడా చేర్చబడ్డాడు.[17][18] 2021 ఏప్రిల్ 8న అశాంత డి మెల్ స్థానంలో క్రీడా మంత్రి నమల్ రాజపక్సే సిఫార్సుపై శ్రీలంక క్రికెట్ అతన్ని జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.[19][20][21]

మూలాలు

[మార్చు]
  1. "Pramodya Wickramasinghe profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  2. Lalotra, Gautam (2018-07-04). "Top 10 Fast Bowlers in ODI cricket during the 1990s". www.sportskeeda.com. Retrieved 2023-08-31.
  3. "'1996' – a dream year overall". Print Edition - The Sunday Times, Sri Lanka. Retrieved 2023-08-31.
  4. "Pramodya Wickramasinghe to head Sri Lanka men's and women's selection committee". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  5. "Pramodya Wickramasinghe: Six facts about the Sri Lankan fast bowler". Cricket Country. 2015-08-14. Retrieved 2023-08-31.
  6. "Pramodya Wickramasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  7. Waters, Chris (2014). 10 for 10: Hedley Verity and the Story of Cricket’s Greatest Bowling Feat (in ఇంగ్లీష్). A&C Black. p. 215. ISBN 9781472908919. Retrieved 2023-08-31.
  8. "Sinhalese Sports Club v Kalutara Physical Culture Centre". ESPNcricinfo. Retrieved 2023-08-31.
  9. "Full Scorecard of Sri Lanka vs Bangladesh 3rd Match 1990/91 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  10. "Full Scorecard of Sri Lanka vs Pakistan 1st Test 1991/92 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  11. "Sri Lanka beat Pakistan in Sialkot to win their first-ever 3-match Test series away from home". Cricket Country. 2013-09-26. Retrieved 2023-08-31.
  12. "Sri Lanka in Pakistan Test Series, 1995/96 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-08-31.
  13. Doshi, Pratik (2018-09-17). "Sri Lanka of the 1996 World Cup: Tribute to the side that revolutionized cricket". www.sportskeeda.com. Retrieved 2023-08-31.
  14. "Sri Lanka Cricketers' Association announce new awards". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  15. "Ashantha de Mel to head selection panel". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  16. "Jayasuriya named chairman of selectors". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  17. Sportstar, Team. "Ashantha de Mel named chairman of national selection committee in SLC". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  18. "Pramodya likely to be the fourth selector". www.dailymirror.lk (in English). Retrieved 2023-08-31.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  19. Welagedara, Indika. "Pramodya to be new Chief Selector?". Daily News (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.
  20. "PRAMODYA WICKRAMASINGHE TO REPLACE DE MEL?". The Morning - Sri Lanka News. 2021-01-29. Retrieved 2023-08-31.
  21. "Sri Lanka Cricket appoints new Selection Committee". Sri Lanka News - Newsfirst (in ఇంగ్లీష్). Retrieved 2023-08-31.

బాహ్య లింకులు

[మార్చు]