ప్రవరాఖ్యుడు (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మదన్ |
---|---|
తారాగణం | జగపతి బాబు, ప్రియమణి, హంసా నందిని, బ్రహ్మానందం, ఆలీ |
విడుదల తేదీ | 4 డిసెంబర్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రవరాఖ్యుడు 2009 లో విడుదలైన యాక్షన్ చిత్రం. టోలీ 2 హోలీ ఫిల్మ్స్ బ్యానర్‌లో గణేష్ ఇందుకూరి నిర్మించాడు. మదన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రియమణి నటించారు.సంగీతం ఎంఎం కీరవాణి సమకూర్చాడు. ఈ చిత్రం 2009 డిసెంబరు 4 న విడుదలైంది.[1]
యుఎస్ లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర ప్రొఫెసర్ అయిన శశి (జగపతి బాబు) తన స్వస్థలానికి తిరిగి వస్తాడు. పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడటానికి అతను రెండు సంబంధాలను చూస్తాడు. కానీ, అవి అతని మనస్తత్వానికి సరిపోవు. తన సహవిద్యార్థి శైలజ ( ప్రియమణి ) ను మరచిపోలేకపోతున్నాడని అతని స్నేహితుడు రవి ( సునీల్ ) ఒక తర్కాన్ని తెస్తాడు. హీరో తన కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చుకుంటాడు
ఒక దశాబ్దం క్రితం… శశి, శైలజ ఒక కాలేజీలో క్లాస్‌మేట్స్. కుర్రాళ్ళు కాలేజీ బ్యూటీ అయిన శైలజ వెనక పడుతూండేవాళ్ళు. శైలజ అతన్ని ప్రేమిస్తుంది, కాని ప్రేమ గురించి శశి కున్న భావజాలం శైలజను చాలా చికాకుపెడుతుంది. ఆమె అతని తత్వానికి విముఖంగా ఉంది. ఆ ఆధునిక ప్రవరాఖ్యుడిని ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైన శైలజ ఆ ఆలోచనను వదిలివేసి, తన మార్గంలో వెళ్ళిపోయింది. శైలజ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుందని, ఆమెకు కూడా పెళ్ళికాలేదని శశి తెలుసుకుంటాడు. శశి జీవశాస్త్రంలో లెక్చరర్‌గా ఆ కళాశాలలో ప్రవేశిస్తాడు. శశి శైలజను మళ్లీ ప్రేమలో పడవేసుకోవడమే మిగతా కథ
సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "గాలమేసి పట్టిన చేప" | రంజిత్, భార్గవి పిళ్ళె | 4:56 |
2. | "నీలా నీలిమబ్బు" | సునీత | 4:18 |
3. | "ఏమైపోయానో" | అనుజ్, శివాని | 4:10 |
4. | "కూల్ బి కూల్" | హేమచంద్ర, గీతామాధురి | 5:25 |
5. | "బంగారం" | కీరవాణి, గీతామాధురి | 4:24 |