ప్రసన్న | |
---|---|
జననం | ప్రసన్న వెంకటేశన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
ప్రసన్న వెంకటేశన్, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటుడు. అయితే, ఆయన తమిళంతో పాటు కొన్ని తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలోనూ నటించాడు.
ఆయన 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్లో తన మొదటి విజయాన్ని సాధించాడు. విజయవంతమైన ఆయన చిత్రాలలో మరికొన్ని కన్నుమ్ కన్నుమ్ (2008), చీనా తానా 001 (2007), అంజతే (2008), కంద నాల్ ముదల్ (2005), నంగా రొంబ బిజీ (2020), నానయం (2010) వంటివి. ప్రధాన పాత్రలే కాకుండా విలన్ పాత్రలు కూడా ఆయన పోషించాడు. అచ్చముండు! అచ్చముండు! (2009) సినిమాలో ఆయన స్నేహ, అమెరికన్ నటుడు జాన్ షియాతో కలిసి నటించాడు. ఈ చిత్రం షాంఘై, కైరో వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.[1][2]
2009లో ఆర్యన్ రాజేష్ నటించిన తమిళ సినిమాలో ఆయనకు ప్రసన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఇక ప్రసన్న నటించిన తెలుగు సినిమాలలో భాయ్ (2013), రాజాధి రాజా (2015), జవాన్ (2017), విశ్వామిత్ర (2019) ఉన్నాయి. స్ట్రీమింగ్ సేవ ఆహా వెబ్ సీరీస్ అద్దం (2020)లోనూ ఆయన నటించాడు.
ప్రసన్న తిరుచిరాపల్లిలో జన్మించాడు. అక్కడ, ఆయన బీహెచ్ఈఎల్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రసన్న పాఠశాల విద్య నుండే మిమిక్రీ, నటనలలో అభిరుచి కలిగి ఉన్నాడు.[3] దీంతో, ఆయన సారనాథన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఈఈఈ చదువుతూండగానే సుసి గణేశన్ దర్శకత్వంవహించిన ఫైవ్ స్టార్ (2002)లో మొదటగా అవకాశం వచ్చింది.[4]
అచ్చముండు! అచ్చముండు! చిత్రంలో తన సరసన నటించిన స్నేహను 2012 మే 11న వివాహం చేసుకున్నాడు.[5][6][7] వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.[8][9][10][11]
{{cite web}}
: zero width space character in |title=
at position 32 (help)CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: unfit URL (link)