వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మురళీకృష్ణ ప్రసిద్ధ్ కృష్ణ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బెంగళూరు, కర్ణాటక | 1996 ఫిబ్రవరి 19|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (188 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 234) | 2021 మార్చి 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 ఆగస్టు 20 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 24 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–ప్రస్తుతం | కర్ణాటక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2021 | కోల్‌కతా నైట్ రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–ప్రస్తుతం | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 20 ఆగస్టు 2022 |
మురళీకృష్ణ ప్రసిద్ధ్ కృష్ణ, కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. దేశీయ క్రికెట్‌లో కర్ణాటక, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.[2] కుడిచేతి ఫాస్ట్ బౌలర్గా 145kmph కంటే ఎక్కువ వేగంతో నిలకడగా బౌలింగ్ చేశాడు.[3][4] 2021, మార్చి 23న ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు తరపున వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, వన్డే అరంగేట్రంలో అత్యధిక వికెట్లు సాధించిన 24 ఏళ్ళ భారతీయ రికార్డును చేధించాడు.[5]
మురళీకృష్ణ ప్రసిద్ధ్ కృష్ణ 1996, ఫిబ్రవరి 19న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు.
2015లో బంగ్లాదేశ్ ఎ భారత పర్యటనలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. ముగ్గురు ఫ్రంట్‌లైన్ కర్ణాటక పేస్ బౌలర్ల గైర్హాజరీలో బంగ్లాదేశ్ ఎతో జరిగిన టూర్ మ్యాచ్‌లో కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో 49 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఎ స్కోరును 41/5కి తగ్గించడానికి తన మొదటి స్పెల్‌లో అనముల్ హక్, సౌమ్య సర్కార్, నాసిర్ హొస్సేన్‌ల వికెట్లను తీయడానికి ముందు, రోనీ తాలూక్దార్‌ను అవుట్ చేస్తూ, తన మొదటి బంతికి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[6][7]
2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8] 2018, జనవరి 21న 2017–18 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[9]
2018-19 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున ఏడు మ్యాచ్‌లలో పదమూడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[10]
2018 ఆగస్టులో 2018 ఎ-టీమ్ క్వాడ్రాంగులర్ సిరీస్ కోసం ఇండియా ఎ క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు.[11] 2018 డిసెంబరులో అతను 2018 ఎసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు.[12]
2021-22 రంజీ ట్రోఫీ సమయంలో జమ్మూ - కాశ్మీర్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 6/35, రెండవ ఇన్నింగ్స్‌లో 4/59తో తన తొలి ఫస్ట్‌క్లాస్ పది వికెట్లు తీసుకున్నాడు.[13]
2018 ఏప్రిల్ లో గాయపడిన కమలేష్ నాగర్‌కోటికి బదులుగా 2018 ఐపిఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇతన్ని కొనుగోలు చేసింది.[14] 2018 మే 6న గాయపడిన శివమ్ మావి స్థానంలో ముంబై ఇండియన్స్‌పై ఐపిఎల్ లోకి అరంగేట్రం చేశాడు.[15]
2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.[16]
2021 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు.[17] 2021, మార్చి 23న ఇంగ్లండ్‌పై భారతదేశం తరపున అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[18] ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి, 66 పరుగుల తేడాతో భారత్‌ను గెలిపించాడు.[19]
2021 మేలో 2019–2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి, ఇంగ్లాండ్‌తో జరిగిన ఎవే సిరీస్ కోసం భారతదేశ టెస్ట్ స్క్వాడ్‌లోని నలుగురు స్టాండ్‌బై ప్లేయర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[20][21] 2021 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు భారత ప్రధాన జట్టులో చేర్చబడ్డాడు, కానీ ఆడలేదు.[22]
2022 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల భారత జట్టులో ప్రసిద్ధ్‌కు చోటు దక్కింది. ఇతను రెండవ మ్యాచ్‌లో 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[23] మూడవ మ్యాచ్‌లో త్రీ-ఫెర్‌తో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.[24]
2022 మేలో ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్టు కోసం భారత టెస్ట్ జట్టులో అతను ఎంపికయ్యాడు.[25]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)