ప్రస్థానం | |
---|---|
దర్శకత్వం | దేవ కట్టా |
రచన | దేవ కట్టా |
నిర్మాత | వల్లభనేని రవి, విజయకృష్ణ |
తారాగణం | శర్వానంద్ రుబీ పరిహార్ సాయి కుమార్ జయప్రకాశ్ రెడ్డి వెన్నెల కిషోర్ సందీప్ కిషన్ బలిరెడ్డి పృధ్వీరాజ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్‌దత్. ఎస్ |
కూర్పు | కాకరాల ధర్మేంద్ర |
సంగీతం | మహేష్ శంకర్ |
విడుదల తేదీ | 2010 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
బడ్జెట్ | 3.5 కోట్లు |
ప్రస్థానం 2010 లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. పధవి అనే పేరుతో తమిళం లోకి డబ్బింగు చేశారు. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు గాను ఈ చిత్రం ఎంపికైంది.[1][2]
ఉత్తమ తృతీయ చిత్రంగా, నంది పురస్కారం . ఉత్తమ సహాయ నటుడు, సాయి కుమార్ , నంది అవార్డు
ప్రముఖ సినిమా పత్రిక నవతరంగం తెలుగులో వచ్చే మంచి సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశం వెలువరిస్తూ ప్రస్థానం సినిమాకు మంచి సమీక్ష రాస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి" అన్న పేరుతో వచ్చిన ఈ పోటీ ప్రకటించడమే సినిమా విశిష్టతకు గీటురాయిగా నిర్వహించారు.[3]