అందాల పోటీల విజేత | |
![]() ప్రాచీ మిశ్రా | |
జననము | [1] ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1988 ఫిబ్రవరి 11
---|---|
వృత్తి | మోడల్, నటి, యజమాని, షాక్ టాలెంట్ మోడలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ |
బిరుదు (లు) | ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012 |
భర్త | |
పిల్లలు | 1 |
ప్రాచీ మిశ్రా రాఘవేంద్ర (జననం 1988 ఫిబ్రవరి 11) ఒక భారతీయ నటి, మోడల్ అందాల పోటీ టైటిల్ హోల్డర్.[1] ఆమె ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2011లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించింది.[2] ఫెమినా మిస్ ఇండియా 2012 ఉప పోటీలలో ఆమె మిస్ కాన్జెనియాలిటీ కిరీటాన్ని కూడా గెలుచుకుంది.
ప్రాచీ మిశ్రా ఉత్తరప్రదేశ్ లో పుట్టి పెరిగింది. ఆమె మథురలోని హిందూస్తాన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేసింది. ఆమె మహారాష్ట్రలోని పూణేలో సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి బ్యాంకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా పూర్తి చేసింది.[3][4]
ఆమె నటుడు మహత్ రాఘవేంద్ర ను 2020 ఫిబ్రవరి 1న వివాహం చేసుకుంది. వారికి కుమారుడు ఆదియామన్ రాఘవేంద్ర 2021 జూన్ 7న జన్మించాడు.
ప్రాచీ మిశ్రా ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రవేశించి ఫెమినా మిస్ భారత ఎర్త్ బిరుదును గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2012 ఉప పోటీలలో ఆమె మిస్ కాన్జెనియాలిటీ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఆమె 2011లో పూణేలో రేడియో మిర్చి బ్యూటీ క్వీన్ అవార్డును కూడా గెలుచుకుంది.
ఫిలిప్పీన్స్ లోని మనీలాలో జరిగిన మిస్ ఎర్త్ 2012లో ప్రాచీ మిశ్రా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె మిస్ ఎర్త్ 2012లో గ్రూప్ 1లో మిస్ ఫ్రెండ్షిప్ కోసం బంగారు పతకాన్ని గెలుచుకుంది. మిస్ కాన్జెనియాలిటీ 2012 కిరీటాన్ని పొందింది.[5]