ప్రియ తెలుగు సినిమా, సీరియల్ నటి. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఆమె 1997లో 'మాస్టర్' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. ప్రియ 2021లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది.[1][2]
మామిళ్ల శైలజ ప్రియ 1997లో మాస్టర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, జెమినిలో 'శక్తి' సీరియల్ ద్వారా టీవీ ధారావాహికల్లో కూడా నటించి ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది.[3]