ప్రియాంకా దత్ | |
---|---|
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1984 డిసెంబరు 19
వృత్తి | సినిమా నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | స్వప్న దత్ (సోదరి), ప్రసాద్ వర్మ (బావ), స్రవంతి దత్ (సోదరి) |
ప్రియాంక దత్ (జననం19 డిసెంబరు1984) [ఆధారం చూపాలి] హైదరాబాదుకు చెందిన భారతీయ సినిమా దర్శకురాలు. [ఆధారం చూపాలి]. ఆమె ప్రముఖ సినిమా నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ కుమార్తె. ఆమె యు.సి.ఎల్.ఎ (యూనివర్శిటీ ఆఫ్ లాస్ ఏంజల్స్) నుండి చిత్ర నిర్మాణానికొరకు విద్యనభ్యసించింది. [ఆధారం చూపాలి]. ఆమె తన 21వ యేట 2004 లో బాలు చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించింది. ఆమె త్రీ ఏంజల్స్ స్టుడియో యొక్క వ్యవస్థాపకురాలు. 2013లో ఆమె నిర్మాతగా "యాదోం కీ బరాత్" అనే లఘుచిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక అయినది.
ఆమె తన సినిమా జీవితాన్ని బాంబే ఆధారిత దర్శకుడు, వాణిజ్య ప్రకటనలనిర్మాత అయిన "షోజిత్ సిర్కార్" వద్ద ప్రారంభించింది. ఆమె తన తండ్రి గారి వైజయంతీ మూవీస్ బ్యానర్ కు సహ నిర్మాతగా ఉండుటకు హైదరాబాదు వచ్చింది. ఆమె "బాలు (2004)",, శక్తి (2011) చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది.
ఆమె స్వంతంగా త్రీ ఏంజల్స్ స్టుడియోను చిత్ర నిర్మాణంకోసం 2009లో ప్రారంభించింది. ఈ సంస్థను కొత్త తరం సినిమాలకు ప్రోత్సాహం కల్పించేందుకు సృష్టించింది.[1] ఈ స్టుడియోలో మొదటి సినిమా బాణం (2009) . ఈ చిత్రంలో ఒక నక్సలైట్ యొక్కకుమారుడు ఐ.పి.ఎస్ అధికారిగా చూపబడింది. ఈ సమస్యను చూపినందుకు అనేకమంది విమర్శకుల ప్రశంసలనందుకుంది.[2] ఈ చిత్రానికి ప్రియాంకాకు వెండి నంది పురస్కారం 2009 లో ఉత్తమ సినిమా వర్గంలో వచ్చింది.[3] ఈ స్టుడియో 2010లో కాజల్ అగర్వాల్, నవదీప్ లతో ఓం శాంతి చిత్రాన్ని నిర్మించింది. 2011 లో రవితేజ, కాజల్ అగర్వాల్ తారాగణంగా సారొచ్చారు చిత్రాన్ని నిర్మించింది.
2013లో ఆమె మూడు నిమిషాలు నిడివి గల లఘు చిత్రం హిందీలో "యాదోం కీ బాత్" నిర్మించింది. ఈ చిత్రం 2013 కాన్నెస్ ఫిల్ం ఫెస్టివల్ కు నామినేట్ కాబడింది.[4]
సంవత్సరం | చిత్రం | పాత్ర | నిర్మాణం |
---|---|---|---|
2004 | బాలు | N/A | వైజయంతీ మూవీస్ |
2005 | జై చిరంజీవ | N/A | వైజయంతీ మూవీస్ |
2009 | బాణమ్ | నిర్మాత | త్రీ ఏంజల్స్ స్టుడియో |
2010 | ఓం శాంతి | నిర్మాత | త్రీ ఏంజల్స్ స్టుడియో |
2011 | శక్తి | నిర్మాత | వైజయంతీ మూవీస్ |
2012 | సారొచ్చారు | నిర్మాత | త్రీ ఏంజల్స్ స్టుడియో |
2013 | యాదోంకీ బరత్ | నిర్మాత | త్రీ ఏంజల్స్ స్టుడియో |
2015 | యెవడే సుబ్రహ్మణ్యం | నిర్మాత | స్వప్న సినిమా |