ప్రియాంక షా | |
---|---|
జననం | పూణె, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, నెట్‌బాల్ క్రీడాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
ప్రియాంక షా ఒక భారతీయ మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ టూరిజం ఇండియా 2007 విజేత ఆమె ఫెమినా మిస్ ఇండియా 2007 ఫైనలిస్ట్. ఆమె గెట్ గార్జియస్ 2005 విజేత కూడా.
ప్రియాంక షా తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందిన గుజరాతీలు.[1] ఆమె పూణేలోని ఎంఐటి కళాశాల నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది.
2002లో, ఆమె మలేషియాలో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లో నెట్‌బాల్ అరంగేట్రం చేసింది.[2] ఆమె భారత జాతీయ నెట్‌బాల్ జట్టుకు మాజీ కెప్టెన్ కూడా.[3] ఆమె 2005 ఆసియా నెట్‌బాల్ ఛాంపియన్షిప్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించింది.[4] 2005లో, ఆమె గెట్ గార్జియస్ అనే రియాలిటీ టెలివిజన్ షో రెండవ ఎడిషన్ ను గెలుచుకుంది.[5] ముంబైలోని కిషోర్ నమిత్ కుమార్ యాక్టింగ్ స్కూల్లో ఆమె నటన కోర్సు పూర్తి చేసింది.