ప్రీతికా రావు | |
---|---|
![]() 2015లో ప్రీతికా రావు | |
జననం | ప్రీతిక |
విద్యాసంస్థ |
|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2010–2019 |
బంధువులు | అమృతా రావు (సోదరి) |
ప్రీతిక (జననం 1992 మే 29) మాజీ భారతీయ నటి, మోడల్, చలనచిత్ర కాలమిస్ట్, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్, చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2010లో చిక్కు బుక్కు తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది. బెంతెహా (2013-14)తో టెలివిజన్ అరంగేట్రం చేసిన ఆమె ఆలియా జైన్ అబ్దుల్లా పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందింది.[1] దీనికి బెస్ట్ డెబ్యూ-ఫిమేల్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. GR8! కు గాను ITA అవార్డును హర్షద్ అరోరాతో తెరపై జంటగా గెలుచుకుంది.
ఆమె 2017లో లవ్ కా హై ఇంతేజార్ లో మోహిని అయాన్ మెహతా పాత్ర పోషించింది. ఆమె జీ5 చిత్రం 377 అబ్ నార్మల్ (2019)తో హిందీ చలనచిత్రసీమలో ప్రవేశించింది. కాకపోతే ఇదే ఆమె నటించిన చివరి చిత్రం.
కర్ణాటకలోని మంగళూరులో ప్రీతికా రావు 1992 మే 29న జన్మించింది. ఆమె కొంకణి మాట్లాడే హిందూ కుటుంబం నుండి వచ్చింది. ఆమె సోఫియా కాలేజీ నుండి చరిత్రలో పట్టభద్రురాలైంది. అదే సమయంలో అడ్వర్టైజింగ్, జర్నలిజంలో డిప్లొమా కూడా పొందింది. ఆమె సోదరి అమృతా రావు బాలీవుడ్ నటి.
ప్రీతికా రావు బెంగుళూరు మిర్రర్, డెక్కన్ క్రానికల్, ది ఏషియన్ ఏజ్ వార్తా పత్రికలకు కాలమిస్ట్ గా పనిచేసింది. ఆమె నటనా రంగ ప్రవేశం తర్వాత, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, న్యూయార్క్ నుండి బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో డిప్లొమా కోర్సు కోసం యు.ఎస్.ఎ వెళ్లింది.
Year | Title | Role | Language | Notes | Refs |
---|---|---|---|---|---|
2010 | చిక్కు బుక్కు | మీనల్ "అమ్ము" | తమిళం | [2] | |
2012 | ప్రియుడు | మధు లత | తెలుగు | [3] | |
2015 | రెబల్ | ప్రీతిక | కన్నడం | [4] | |
2017 | మెట్రో ములాకత్ | ప్రియా | హిందీ | షార్ట్ ఫిల్మ్ | |
2019 | 377 అబ్ నార్మల్ | నేహా | [5] |
Year | Award | Category | Work | Result | Ref. |
---|---|---|---|---|---|
2014 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ | హర్షద్ అరోరా తో కలసి GR8! ఆన్-స్క్రీన్ కపుల్ ఆఫ్ ది ఇయర్ | బెంతెహా | [6] | |
ఉత్తమ నటి - పాపులర్ | |||||
ఇండియన్ టెలీ అవార్డ్స్ | ఫ్రెష్ ఫేస్ (ఫీమెల్) | [7] | |||
భెస్ట్ యాక్ట్రెస్ పాపులర్ | |||||
గోల్డ్ అవార్డ్స్ | ఉత్తమ తొలి నటి | [8] | |||
హర్షద్ అరోరా తో ఉత్తమ చలన చిత్ర జోడి | [9] | ||||
ఆసియన్ వ్యూయర్స్ టెలివిజన్ అవార్డ్స్ | ఫీమెల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ | [10] |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)