ప్రేమమ్ | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | చందు మొండేటి |
స్క్రీన్ ప్లే | చందు మొండేటి |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | గోపీ సుందర్, రాజేష్ మురుగన్ |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్ టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | హారిక & హాసిని క్రియేషన్స్ |
విడుదల తేదీ | 7 అక్టోబరు 2016 |
సినిమా నిడివి | 136 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 cr |
బాక్సాఫీసు | 40 crores est.₹2 crore[1] |
ప్రేమమ్ - 2016 తెలుగు సినిమా. ఇది మలయాళంలో ఫస్ట్ రిలీజ్ అయి హిట్ అయింది.
తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విక్కి (నాగచైతన్య) పదవ తరగతిలో సుమ (అనుపమ పరమేశ్వరన్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సుమ ఓరోజు విక్కితో తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని చెప్పడంతో విక్కి ఎంతో బాధపడతాడు. సుమను స్వార్ధపరురాలని తిట్టుకుంటాడు. ఐదేళ్ల తర్వాత అంటే డిగ్రీ చదువేటప్పుడు విక్కి మరోసారి గెస్ట్ లెక్చరర్ సితార (శృతిహాసన్) ను ప్రేమిస్తాడు. సితార వయసులో విక్కి కంటే పెద్దదైన ఆ విషయాన్ని తేలికగా తీసుకుని ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. సితార కూడా విక్కితో చనువుగా మెలుగుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారే లోపు కాలేజ్‌కి సెమిస్టర్ సెలవులు వస్తాయి. సితార పూణేకు బయలు దేరుతుంది. కానీ దారిలో ఆమె బయలుదేరే బస్సుకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. దాంతో విక్కి.., సితారకు తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు.
సితార వేరొకరిని పెళ్ళి చేసేసుకుంటుంది. పదేళ్ల తర్వాత విక్కి పెద్ద చెఫ్‌గా ఎదుగుతాడు. విక్కి పెట్టిన హోటల్‌కు సిటీలో మంచి పేరు వస్తుంది. విక్కి మాత్రం ఎప్పుడూ సితార జ్ఞాపకాల్లోనే ఉంటుంటాడు. అయితే ఓసందర్భంలో విక్కికి సింధు పరిచయం అవుతుంది. కొన్నిరోజుల తర్వాత సింధుకి విక్కి తన ప్రేమను చెబితే సింధు కూడా తన ఎంగేజ్‌మెంట్ అయ్యిందని చెబుతుంది. విక్కి మరోసారి బాధపడతాడు. కానీ కథ అక్కడే టర్న్ తీసుకుంటుంది. అదెలాంటి మలుపు? విక్కి ప్రేమ సక్సెస్ అవుతుందా? అసలు విక్కికి, సింధు మధ్య చాలా సంవత్సరాల నుండే పరిచయం ఉంటుంది..అదెలాంటి పరిచయం... ? చివరకు విక్కి ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? అనే విషయాలు మిగిలిన కథ