ప్రేమించు

ప్రేమించు
దర్శకత్వంబోయిన సుబ్బారావు
రచనశ్రీరాజ్ గిన్నె
పైడిపల్లి సత్యానంద్
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
తారాగణంలయ
సాయి కిరణ్
రూప
మురళీమోహన్
లక్ష్మి (నటి)
ఛాయాగ్రహణంహరి అనుమోలు
సంగీతంఎం.ఎం శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
11 ఏప్రిల్ 2001
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమించు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై లయ, సాయికిరణ్ ప్రధాన పాత్రదారులుగా నటించగా 2001 లో విడుదలైన ఒక సినిమా. బోయిన సుబ్బారావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చిన్నప్పుడే తల్లి ప్రేమకు నోచుకోలేక తండ్రి చెంతనే పెరిగి జీవితంలో విజయం సాధించిన అంధురాలి కథ ఇది. అంధురాలి పాత్రలో లయ నటించగా, లక్ష్మి, మురళీ మోహన్ ఆమెకు తల్లిదండ్రులుగా నటించారు. సాయికిరణ్ ఆమెకు జోడీగా నటించినా కథ ప్రధానంగా కథానాయిక చుట్టూనే తిరుగుతుంది.

ఈ సినిమా 2001 ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెల్చుకుంది.

మీనా (లయ) ఒక అంధురాలైన కళాశాల విద్యార్థిని. కానీ స్వతంత్ర భావాలు కలిగిన ఆడపిల్లగా, అందరితో సమానంగా జీవితం సాగిస్తుంటుంది. ఆమెకు సురేష్ (సాయి కిరణ్) తో పరిచయమౌతుంది. సురేష్ కు డాలీ అనే మరదలు ఉంటుంది. ఆమె తండ్రి (కోట శ్రీనివాసరావు) సురేష్ బాగా ధనవంతుడని పెళ్ళిచేసుకోమని కోరతాడు.

మీనా యూనివర్శిటీ మొదటి ర్యాంకుతో చదువు పూర్తి చేసుకుని లాయర్ వృత్తిని చేపడుతుంది. మీనా, సురేష్ ల స్నేహం గురించి తెలుసుకున్న మీనా తండ్రి వాసు (మురళీమోహన్) వారిద్దరికీ పెళ్ళి చేద్దామని సురేష్ ఇంటికి వెళతాడు. అక్కడ సురేష్ ను పెంచి పెద్ద చేసిన అత్తను తాను విడాకులిచ్చిన భార్య కౌసల్య (లక్ష్మి (నటి)) గా గుర్తిస్తాడు. మీనా పుట్టుక తోనే చూపు ఉండకపోవడంతో ఆమె తల్లి ఆమెను అనాథాశ్రమంలో వదిలేయాలనుకుంటుంది. ఆమె తండ్రి దానికి అంగీకరించక భార్యతో విడాకులు తీసుకుని ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. మిగతా కథంతా మీనా తల్లి మనసును మార్చి సురేష్ ను ఎలా పెళ్ళిచేసుకున్నదీ, కుటుంబాన్ని ఎలా ఒక్కటి చేసింది అనేదే.

తారాగణం

[మార్చు]
  • మీనాగా లయ, అంధురాలైన న్యాయ విద్యార్థి
  • సురేష్ గా సాయికిరణ్
  • మురళీ మోహన్, మీనా తండ్రి
  • లక్ష్మి, మీనా తల్లి
  • డాలీగా రూప
  • కోట శ్రీనివాసరావు
  • తనికెళ్ళ భరణి
  • ఎల్. బి. శ్రీరామ్
  • ఎం. ఎస్. నారాయణ
  • ఆలీ
  • జూనియర్ రేలంగి

పాటల జాబితా.

[మార్చు]

24క్యారట్ గోల్డెన్ బాబు , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

హాయ్ అమ్మా హాయ్ అమ్మా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

కంటేనే అమ్మ అని, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మా గుండెలలో నిండిన దేవత , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

నూరుకొట్ల ఆంధ్రుల , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

స్వాగతం యువ ప్రేమికులకు స్వాగతం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

తొలిసారి నిను చూసి ప్రేమించినా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

పురస్కారాలు

[మార్చు]
నంది పురస్కారాలు - 2001

బయటి లింకులు

[మార్చు]