ప్రేమ్‌చంద్ గుడ్డు బోరాసి | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | సత్యనారాయణ జాతీయ | ||
---|---|---|---|
తరువాత | చింతామణి మాళవ్య | ||
నియోజకవర్గం | ఉజ్జయిని | ||
పదవీ కాలం 1998 – 2003 | |||
ముందు | ప్రకాష్ సోంకర్ | ||
తరువాత | ప్రకాష్ సోంకర్ | ||
నియోజకవర్గం | సన్వెర్ | ||
పదవీ కాలం 2003 – 2008 | |||
ముందు | మనోహర్ ఉత్వాల్ | ||
తరువాత | మనోహర్ ఉత్వాల్ | ||
నియోజకవర్గం | అలోట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1960 సెప్టెంబరు 2||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఆశా బోరాసి | ||
సంతానం | అజిత్ బోరాసి | ||
నివాసం | ఇండోర్ | ||
వృత్తి | వ్యవసాయ వేత్త, రాజకీయ నాయకుడు |
గుడ్డు ప్రేమ్‌చంద్ (జననం 2 సెప్టెంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ప్రేమ్‌చంద్ గుడ్డు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 నుండి 2008 వరకు రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, ఉజ్జయిని జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ ఛైర్మన్‌గా, ఉక్కు కమిటీ సభ్యుడిగా, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
ప్రేమ్‌చంద్ గుడ్డు 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై సామాజిక న్యాయం మరియు సాధికారత కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయాడు.